ఉగ్రవాద నిరోధక దళం ఎన్‌ఎస్‌జీలోనూ కరోనా!

ABN , First Publish Date - 2020-05-11T22:35:53+05:30 IST

కేంద్ర సాయుధ బలగాలు కూడా కరోనా కారణంగా సతమతమవుతున్నాయి. ఇటీవలే సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్ సిబ్బందిలో కొందరికి కరోనా సోకిన విషయం తెలిసిందే. తాజగా ఉగ్రవాధ నిరోధక దళం నేషనల్ సెక్యురిటీ గార్డ్స్‌కూ కరోనా పాకింది.

ఉగ్రవాద నిరోధక దళం ఎన్‌ఎస్‌జీలోనూ కరోనా!

న్యూఢిల్లీ: కేంద్ర సాయుధ బలగాలు కూడా కరోనా కారణంగా సతమతమవుతున్నాయి. ఇటీవలే సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్ సిబ్బందిలో కొందరికి కరోనా సోకిన విషయం తెలిసిందే. తాజగా ఉగ్రవాధ నిరోధక దళం నేషనల్ సెక్యురిటీ గార్డ్స్‌కూ కరోనా పాకింది. ఎన్‌ఎస్‌జీకి చెందిన వైద్య సిబ్బందిలో ఒకరికి కరోనా సోకినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. గుర్‌గావ్‌లో గల ఎన్‌ఎస్‌జీ ఆస్పత్రిలో బాధితుడు విధులు నిర్వహిస్తున్నాడు. కాగా.. అతడు కరోనా బారిన పడ్డాడని తెలిసిన వెంటనే ఉన్నతాధికారులు బాధితుడిని గ్రేటర్ నోయిడాలోని సీఆర్‌పీఎఫ్ ఆస్పత్రికి తరలించారు. 


అంతకుమునుపు.. బాధితుడు గుర్‌గావ్ ఆస్పత్రిలో ఓ రోగికి సహాయకుడిగా సేవలందించాడని ఎన్‌ఎస్‌జీ ఓ ప్రకటనలో తెలిపింది. విధులు ముగించుకుని తిరగొచ్చాక ప్రోటోకాల్ ప్రకారం అతడిని క్వారంటైన్‌కు తరలించామని, ఆ సమయంలో కరోనా నిర్ధారణ పరీక్ష చేయగా.. అతడు వ్యాధి బారినపడ్డట్టు వెల్లడైందని తెలిపింది. ఎన్‌ఎస్‌జీ పోరాటు విధులకు దీని విల్ల ఎటువంటి ఆటంకం కలగదని స్పష్టం చేసింది. కాగా.. ఈ ఘటనతో ఐదు సాయుధ బలగాల విభాగాల్లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 745 దాటింది. 


Updated Date - 2020-05-11T22:35:53+05:30 IST