నేషనల్ సెక్యూరిటీ గార్డుకు కరోనా వైరస్...ఫస్ట్ కేసు

ABN , First Publish Date - 2020-05-11T13:26:25+05:30 IST

దేశంలో మొట్టమొదటి సారి నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ యాంటీ హైజాక్ విభాగానికి చెందిన ఓ ఉద్యోగికి కరోనా వైరస్ సోకడం కలకలం రేపింది....

నేషనల్ సెక్యూరిటీ గార్డుకు కరోనా వైరస్...ఫస్ట్ కేసు

న్యూఢిల్లీ : దేశంలో మొట్టమొదటి సారి నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ యాంటీ హైజాక్ విభాగానికి చెందిన ఓ ఉద్యోగికి కరోనా వైరస్ సోకడం కలకలం రేపింది. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ విభాగంలో మొట్టమొదటి కరోనా కేసు నమోదు కావడంతో ఆ విభాగం అప్రమత్తమైంది. గురుగ్రామ్ మానేసర్ ప్రాంతంలోని నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఆసుపత్రిలో విధులు నిర్వర్తిస్తున్న ఎన్ఎస్‌జీ ఉద్యోగికి కరోనా సోకిందని పరీక్షల్లో తేలడంతో అతన్ని గ్రేటర్ నోయిడాలోని సెంట్రల్ ఆర్మ్ డ్ పోలీసు ఫోర్స్ ఆసుపత్రికి తరలించి క్వారంటైన్ చేశారు. పారామిలటరీ బలగాలైన బీఎస్ఎఫ్, సీఆర్ పీఎఫ్, ఇండోటిబెటన్ విభాగాల్లోని 745 మందికి కరోనా వైరస్ సోకడంపై కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆందోళన వ్యక్తం చేసింది.

Updated Date - 2020-05-11T13:26:25+05:30 IST