యూపీఏ చైర్మన్‌ పదవిపై ఆసక్తి లేదు: పవార్‌

ABN , First Publish Date - 2020-12-28T07:49:31+05:30 IST

యూపీఏ చైర్మన్‌ పదవిపై తనకు ఆసక్తి లేదని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ చెప్పారు. అసలు యూపీఏ భాగస్వామ్యపక్షాల ముందు అటువంటి ప్రతిపాదన లేదని మీడియాకు ఆయన తెలిపారు...

యూపీఏ చైర్మన్‌ పదవిపై ఆసక్తి లేదు: పవార్‌

న్యూఢిల్లీ, డిసెంబరు 27: యూపీఏ చైర్మన్‌ పదవిపై తనకు ఆసక్తి లేదని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ చెప్పారు. అసలు యూపీఏ భాగస్వామ్యపక్షాల ముందు అటువంటి ప్రతిపాదన లేదని మీడియాకు ఆయన తెలిపారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ స్థానంలో పవార్‌ త్వరలోనే యూపీఏ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరిస్తారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన  దాన్ని కొట్టిపారేశారు.  

Updated Date - 2020-12-28T07:49:31+05:30 IST