ఈశాన్యం ఆదర్శం: కరోనాపై కేంద్ర మంత్రి

ABN , First Publish Date - 2020-05-09T23:19:59+05:30 IST

మహమ్మారి కరోనాపై పోరులో యావత్ దేశానికి ఈశాన్య రాష్ట్రాలు ఆదర్శమని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. శనివారం ఆయన ఈ విషయమై స్పందిస్తూ సంప్రదాయకమైన క్రమశిక్షణ పాటిస్తూ కరోనాను అరికట్టడంలో ఈశాన్య

ఈశాన్యం ఆదర్శం: కరోనాపై కేంద్ర మంత్రి

న్యూఢిల్లీ: మహమ్మారి కరోనాపై పోరులో యావత్ దేశానికి  ఈశాన్య రాష్ట్రాలు ఆదర్శమని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. శనివారం ఆయన ఈ విషయమై స్పందిస్తూ సంప్రదాయకమైన క్రమశిక్షణ పాటిస్తూ కరోనాను అరికట్టడంలో ఈశాన్య రాష్ట్రాలైన సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, మణిపూర్, మేఘాటయ, నాగాలాండ్, త్రిపుర, అస్సాం రాష్ట్రాలు ఉత్తమ ఫలితాల్ని సాధించాయని.. ఆయా రాష్ట్రాలను దేశంలోని మిగిలిన రాష్ట్రాలు అనుసరించాలని అన్నారు.


‘‘వారి సంప్రదాయబద్దమైన కావచ్చు, జీవన విధానమే కావచ్చు.. ఈశాన్య రాష్ట్రాల ప్రజలు నాగరికులు, క్రమశిక్షణ కలిగిన వారు. అందుకే వారు కరోనా లాక్‌డౌన్ నియమాలను తూచా తప్పకుండా పాటించారు. లాక్‌డౌన్ సంబంధిత నిబందనలను అమలు చేయడంలో అక్కడ ఎలాంటి అభ్యంతరం రాలేదు. ఈశాన్యం దేశానికే ఒక చిహ్నం. కరోనాను అరికట్టడంలో మిగతా రాష్ట్రాలకు ఆదర్శం’’ అని జితేంద్ర సింగ్ అన్నారు.

Updated Date - 2020-05-09T23:19:59+05:30 IST