మోదీ ఫొటో వాడితే కేసు పెడతాం: బీజేపీ

ABN , First Publish Date - 2020-10-08T06:49:26+05:30 IST

బిహార్‌ శాసనసభ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ ఫొటో వాడితే కేసు పెడతామని బీజేపీ హెచ్చరించింది. ఎన్డీఏ కూటమిలోని పార్టీలు మాత్రమే ప్రధాని మోదీ ఫొటోలను వినియోగించుకోవాలని...

మోదీ ఫొటో వాడితే కేసు పెడతాం: బీజేపీ

పట్నా, అక్టోబరు 7: బిహార్‌ శాసనసభ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ ఫొటో వాడితే కేసు పెడతామని బీజేపీ హెచ్చరించింది. ఎన్డీఏ కూటమిలోని పార్టీలు మాత్రమే ప్రధాని మోదీ ఫొటోలను వినియోగించుకోవాలని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సంజయ్‌ కుమార్‌ జైస్వాల్‌ పేర్కొన్నారు. సైద్ధాంతిక విభేదాలు ఉన్నాయంటూ ఎన్డీఏ నుంచి ఎల్‌జేపీ అధ్యక్షుడు చిరాగ్‌ పాశ్వాన్‌ తప్పుకొన్న తర్వాత.. ఆ పార్టీ పోస్టర్లపై మోదీ ఫొటోలు ఉండడంతో వివాదం తలెత్తింది. కాగా బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన 50 స్థానాలకు పోటీచేయాలని భావిస్తోంది. పార్టీ చీఫ్‌ నుంచి గ్రీన్‌సిగ్నల్‌ వచ్చిన తర్వాత  అసెంబ్లీ ఎన్నికలకు కసరత్తు మొదలుపెడతామని శివసేన నాయకుడు అనిల్‌ దేశాయ్‌ బుధవారం మీడియాకు చెప్పారు.  

Updated Date - 2020-10-08T06:49:26+05:30 IST