ఆరోగ్య సేవలకు విఘాతం: డబ్ల్యూహెచ్‌వో

ABN , First Publish Date - 2020-09-01T07:58:55+05:30 IST

కరోనా కల్లోలం కారణంగా ఇమ్యునైజేషన్‌, కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు, కేన్సర్‌, హృద్రోగ చికిత్సలకు పెను విఘాతం వాటిల్లిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకటించింది...

ఆరోగ్య సేవలకు విఘాతం: డబ్ల్యూహెచ్‌వో

జెనీవా, ఆగస్టు 31 : కరోనా కల్లోలం కారణంగా ఇమ్యునైజేషన్‌, కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు, కేన్సర్‌, హృద్రోగ చికిత్సలకు పెను విఘాతం వాటిల్లిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకటించింది. ఈ అంశంపై తాము నిర్వహించిన సర్వేలో 105 దేశాలు పాల్గొన్నాయని తెలిపింది. కరోనా ప్రభావంతో మార్చి-జూన్‌ మధ్యకాలంలో స్తంభించిన ప్రధాన వైద్యసేవల వివరాలతో ఈ సర్వే నివేదికను రూపొందించినట్లు వెల్లడించింది. సర్వేలో పాల్గొన్న 70 శాతం దేశాల్లో కీలక ఆరోగ్య సేవలు ప్రతికూలంగా ప్రభావితమైనట్లు గుర్తించామని పేర్కొంది.  

Updated Date - 2020-09-01T07:58:55+05:30 IST