మే 3 వరకు మెట్రో క్లోజ్: ఎన్ఎంఆర్‌సీ చీఫ్

ABN , First Publish Date - 2020-04-15T01:02:14+05:30 IST

దేశ ప్రజలను భయపెడుతున్న కరోనా వైరస్‌ పీఛమణచేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్‌డౌన్‌ను వచ్చే 3

మే 3 వరకు మెట్రో క్లోజ్: ఎన్ఎంఆర్‌సీ చీఫ్

న్యూఢిల్లీ: దేశ ప్రజలను భయపెడుతున్న కరోనా వైరస్‌ పీఛమణచేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్‌డౌన్‌ను వచ్చే 3 వరకు పొడిగిస్తున్నట్టు ప్రధాని నరేంద్రమోదీ ఈ ఉదయం ప్రకటించారు. ఈ నేపథ్యంలో  దేశంలోని అన్ని మెట్రో‌లకు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. నోయిడా మెట్రో రైల్ కార్పొరేషన్ (ఎన్ఎంఆర్‌సీ) పరిధిలోని అన్ని రైళ్లు, ఫీడర్ బస్సు సర్వీసులు మే 3 వరకు నిలిపివేయాలని ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే, రైళ్ల రెగ్యులర్ మెయింటెనెన్స్ మాత్రం షెడ్యూల్ ప్రకారం కొనసాగుతుందని ఎన్ఎంఆర్‌సీ ఎండీ రీతు మహేశ్వరి తెలిపారు. కోవిడ్-19 సేవల్లో భాగంగా ఆహారా సరఫరా కోసం పనిచేస్తున్న బస్సులు మాత్రం ఆ సేవల్లో కొనసాగుతాయని మహేశ్వరి తెలిపారు. అయితే, మెట్రో సర్వీసులు తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తారన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. 

Updated Date - 2020-04-15T01:02:14+05:30 IST