ఇక‌పై ఒక్క క‌రోనా కేసుకు సొసైటీ మొత్తం సీల్ చేయ‌ర‌ట‌!

ABN , First Publish Date - 2020-06-01T15:22:20+05:30 IST

యూపీలోని నోయిడా, ఘజియాబాద్‌లోని సొసైటీల‌లో ఏ ఒక్క‌ కరోనా పాజిటివ్ కేసు న‌మోదైనా ఇక‌పై సొసైటీని పూర్తిగా మూసివేయ‌న‌క్క‌ర‌లేదు. ఈ రెండు జిల్లాల కోసం యూపీ ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని...

ఇక‌పై ఒక్క క‌రోనా కేసుకు సొసైటీ మొత్తం సీల్ చేయ‌ర‌ట‌!

ల‌క్నో: యూపీలోని నోయిడా, ఘజియాబాద్‌లోని సొసైటీల‌లో ఏ ఒక్క‌ కరోనా పాజిటివ్ కేసు న‌మోదైనా ఇక‌పై  సొసైటీని పూర్తిగా మూసివేయ‌న‌క్క‌ర‌లేదు. ఈ రెండు జిల్లాల కోసం యూపీ ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని రూపొందించింది. దీని ప్రకారం కొత్త‌గా కేసు న‌మోదైన టవర్‌ను మాత్రమే సీల్ చేస్తారు. ఇలా చేయ‌డం ద్వారా  సొసైటీలోని మిగిలిన‌వారికి ఎటువంటి ఇబ్బంది ఏర్ప‌డ‌దు. లాక్‌డౌన్ ‌5.0 అమలుకు ముందు నోయిడా, ఘజియాబాద్‌లోని ఏదైనా సొసైటీలో ఒక్క పాజిటివ్ కేసు న‌మోదైనా సొసైటీ మొత్తం మూసివేసేవారు. నోయిడా సొసైటీలో వేలాది కుటుంబాలు ఉంటున్నాయి. అటువంటి పరిస్థితిలో క‌రోనా కేసుల కార‌ణంగా సొసైటీ మొత్తం సీలు వేయ‌డం వ‌ల‌న‌ చాలామంది ఇబ్బందుల‌ను ఎదుర్కొంటున్నారు. అయితే లాక్‌డౌన్ 5.0లో దీనికి ప‌రిష్కార మార్గాన్ని సూచించారు. గౌతమ్ బుద్ధ్‌న‌గ‌ర్‌ (నోయిడా), ఘజియాబాద్‌లో కోవిడ్ 19 కేసు న‌మోద‌య్యే స్థలాన్ని మాత్రమే కంటైనర్‌ జోన్‌గా ప్రకటిస్తామని అదనపు ప్రధాన కార్యదర్శి హోమ్ అవ్నిష్ కుమార్ అవస్థీ తెలిపారు. సొసైటీలో ఒకటి కంటే ఎక్కువ టవర్లలో కేసులు న‌మోదైతే అప్ప‌టి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, త‌గిన ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. వాణిజ్య, పారిశ్రామిక కార్యాలయాలు లేదా భవనాలలో కేసులు న‌మోదైతే ఆ కార్యాలయం లేదా భవనం 24 గంటల పాటు మూసివేస్తార‌ని తెలిపారు. ఆ ప్రాంతాన్ని పూర్తిగా శానిటైజ్ చేస్తార‌ని, ఇందుకు అయ్యే ఖర్చును భవన యజమాని భరించాల్సివుంటుంద‌ని తెలిపారు. 

Updated Date - 2020-06-01T15:22:20+05:30 IST