సుశాంత్ పోస్టుమార్టం నివేదికపై టైమ్‌ ఎందుకు వేయలేదు?: ఎయిమ్స్ డాక్టర్

ABN , First Publish Date - 2020-08-23T01:44:37+05:30 IST

దివంగత బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పోస్ట్‌మార్టం నివేదికను ప‌రిశీలిస్తున్న ఎయిమ్స్ ఫోరెన్సి..

సుశాంత్ పోస్టుమార్టం నివేదికపై టైమ్‌ ఎందుకు వేయలేదు?: ఎయిమ్స్ డాక్టర్

న్యూఢిల్లీ: దివంగత బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్  పోస్ట్‌మార్టం నివేదికను ప‌రిశీలిస్తున్న ఎయిమ్స్ ఫోరెన్సిక్ వైద్య నిపుణుల బృందం తొలిరోజే ఓ కీలక విషయాన్ని బయటపెట్టింది. సుశాంత్ పోస్టుమార్టం నివేదికపై టైమ్‌స్టాంప్ వేయలేదని ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్న డాక్టర్ సుధీర్ గుప్త పేర్కొన్నారు. ఇది చాలా ‘‘కీలకమైన ఆధారమని’’ ఆయన అన్నారు. ఓ ప్రముఖ టీవీ ఛానెల్‌తో ఆయన మాట్లాడుతూ.. ‘‘పోస్టుమార్టం నివేదికలో టైం వేయాల్సిన కాలమ్‌ను ఖాళీగా వదిలేశారు. వాళ్లు దీనికి సమాధానం చెప్పాలి. అలాగే ఒకవేళ ఏదైనా మిస్ అయినట్టు అనిపిస్తే... పోలీసులు దాన్ని అడిగి నివృత్తి చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం వైద్యుల నుంచి రెండో అభిప్రాయం (సెకండ్ ఒపీనియన్) తీసుకోవాల్సి ఉంది. ఇక్కడ అది జరగలేదు..’’ అని ఆయన పేర్కొన్నారు.


సుశాంత్ కేసులో విచారణ చేపట్టిన సీబీఐ నిన్న ఎయిమ్స్‌ ఆస్పత్రికి చెందిన ఐదుగురు ఫోరెన్సిక్ నిపుణులతో ఓ వైద్య బృందాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఫోరెన్సిక్ విభాగం చీఫ్ డాక్టర్ సుధీర్ గుప్తా నేతృత్వంలో ఈ బృందం సుశాంత్ పోస్టుమార్టం నివేదికను ప‌రిశీలించి.. సీబీఐకి సమగ్ర నివేదిక సమర్పించనుంది. పోస్టుమార్టం నివేదికతో పాటు సుశాంత్ శరీరంపై ఉన్న గాయాలపై వైద్య పరంగా పరిశోధన జరిపి మెడికో లీగల్ అభిప్రాయాన్ని కూడా ఎయిమ్స్ వైద్యులు అందించనున్నారు. 

Updated Date - 2020-08-23T01:44:37+05:30 IST