ట్రంప్ ఝలక్: ఇదీ డబ్ల్యూహెచఓ రెస్పాన్స్

ABN , First Publish Date - 2020-04-16T00:52:47+05:30 IST

ప్రపంచ ఆరోగ్య సంస్థకు అమెరికా నిధులు నిలిపివేసిన నేపథ్యంలో.. సంస్థ చీఫ్ తాజాగా స్పందించారు. ప్రాణాలు ఎలా కాపాడాలన్న దానిపైనే తాము పూర్తిగా దృష్టిని కేంద్రీకరించామన్నారు.

ట్రంప్ ఝలక్: ఇదీ డబ్ల్యూహెచఓ రెస్పాన్స్

వాషింగ్టన్: ప్రపంచ ఆరోగ్య సంస్థకు అమెరికా నిధులు నిలిపివేసిన నేపథ్యంలో.. సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనమ్ తాజాగా స్పందించారు. ప్రాణాలు ఎలా కాపాడాలన్న దానిపైనే తాము పూర్తిగా దృష్టిని కేంద్రీకరించామన్నారు.  ‘కాలయాపనకు ఇది సమయం కాదు. కరోనా మహమ్మారిని నిరోధించి, ప్రజల ప్రాణాలు కాపాడటంపైనే సంస్థ పూర్తిగా దృష్టి కేంద్రీకరించింది’ అని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనమ్ అన్నారు. ఈ మేరకు ఆయన ఓ ట్విట్ చేశారు. కరోనాపై డబ్ల్యూహెచ్ఓ తాజాగా జారీచేసిన సూచనలు, ప్రణాళికను కూడా జత చేశారు. కరోనా కట్టడికి వివిధ స్థాయిల్లో ఏయే చర్యలు చేపట్టాలో అందులో వివరించామని తెలిపారు. ‘ఎంత ఎక్కువగా పరీక్షలు నిర్వహించి కేసులను గుర్తిస్తే..అంత తక్కువగా కరోనా వ్యాపిస్తుంది. గతానుభవం నేర్పుతున్నది ఇదే. ఈ సూత్రం.. ప్రాణాలు కాపాడటంతో పాటూ ఆర్థిక వ్యవస్థ కూడా నిలదొక్కుకునేలా చేస్తుంది’ అని టెడ్రోస్ వ్యాఖ్యానించారు.  

Updated Date - 2020-04-16T00:52:47+05:30 IST