రాజకీయాలొద్దు: ప్రధానితో కాన్ఫరెన్స్‌లో మమతా బెనర్జీ

ABN , First Publish Date - 2020-05-11T23:54:33+05:30 IST

రాజకీయాలు చేయకూడదు. పెద్ద రాష్ట్రాల కంటే మాకు ఉండే సమస్యలు ప్రత్యేకమైనవి. ఇతర దేశాలతో అంతర్జాతీయ సరిహద్దులు కలిగి ఉన్నాం’’ అని మమతా బెనర్జీ అన్నారు.

రాజకీయాలొద్దు: ప్రధానితో కాన్ఫరెన్స్‌లో మమతా బెనర్జీ

కోల్‌కతా: కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం రాజకీయాలు చేయవద్దని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో ముఖ్యమంత్రుల కాన్ఫరెన్స్‌లో భాగంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఓ రాష్ట్రంగా మేము కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి ఉత్తమంగా పని చేస్తున్నాం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం రాజకీయాలు చేయకూడదు. పెద్ద రాష్ట్రాల కంటే మాకు ఉండే సమస్యలు ప్రత్యేకమైనవి. ఇతర దేశాలతో అంతర్జాతీయ సరిహద్దులు కలిగి ఉన్నాం’’ అని మమతా బెనర్జీ అన్నారు.


‘‘అన్ని రాష్ట్రాలకు సమానమైన ప్రాముఖ్యత ఇవ్వాలి. అందరూ కలిసి టీం ఇండియాగా పని చేయాలి’’ అని మమతా అన్నారు. కాగా కొద్ది రోజుల క్రితం కేంద్రం వర్సెస్ బెంగాల్ అన్న రీతిలో పరిస్థితి కనిపించింది. బెంగాల్‌లో కరోనా టెస్టుల తీరు.. అలాగే కరోనా పాజిటివ్ కేసులతో పోల్చితే అత్యధిక శాతంలో మరణాలు సంభవించడం పట్ల ఆ రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం విరుచుకుపడింది. అంతే కాకుండా ఈ మధ్యే ఆ రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక బృందం లాక్‌డౌన్ నిర్వహణ సరిగా జరగడం లేదంటూ నివేదిక సమర్పించింది.

Updated Date - 2020-05-11T23:54:33+05:30 IST