328 ఏళ్ల సంప్ర‌దాయానికి విఘాతం.... ఊరేగింపుతో ద‌ర్శ‌న‌మివ్వ‌ని జ‌గ‌న్నాథుడు!

ABN , First Publish Date - 2020-06-23T15:58:49+05:30 IST

జార్ఖండ్‌లో 328 ఏళ్ల జ‌గ‌న్నాథ ర‌థ‌యాత్ర సంప్ర‌దాయానికి విఘాతం క‌లిగింది. రాంచీలోని జగన్నాథ‌ ఆలయ రథయాత్రకు సంబంధించి...

328 ఏళ్ల సంప్ర‌దాయానికి విఘాతం.... ఊరేగింపుతో ద‌ర్శ‌న‌మివ్వ‌ని జ‌గ‌న్నాథుడు!

రాంచీ: జార్ఖండ్‌లో 328 ఏళ్ల జ‌గ‌న్నాథ ర‌థ‌యాత్ర సంప్ర‌దాయానికి విఘాతం క‌లిగింది. రాంచీలోని జగన్నాథ‌ ఆలయ రథయాత్రకు సంబంధించి జిల్లా యంత్రాంగం ఉత్త‌ర్వులు జారీచేసింది. కరోనా వైరస్ వ్యాప్తి చందుతున్న దృష్ట్యా ఈ నిర్ణ‌యం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. రాంచీలోని జగన్నాథ్‌పూర్‌లో 1691 సంవత్సరం నుంచి రథయాత్ర నిర్వ‌హిస్తూ వ‌స్తున్నారు. అయితే ఆల‌యం లోప‌ల పూజారులు స్వామివారి ర‌థ‌యాత్ర నిర్వ‌హించ‌నున్నారు. ప‌రిమిత సంఖ్య‌లో భ‌క్తుల‌కు అనుమ‌తినివ్వ‌నున్నారు. 


Read more