బెంగాల్‌కు శ్రామిక్ రైళ్లు నడిపే ఉద్దేశం లేదు: రైల్వే

ABN , First Publish Date - 2020-05-09T22:45:23+05:30 IST

పశ్చిమ బెంగాల్‌కు శ్రామిక్ రైళ్లు నడిపే ప్రతిపాదన ఏదీ లేదని రైల్వే అధికారులు తెలిపారు. కర్ణాటక, తమిళనాడు,

బెంగాల్‌కు శ్రామిక్ రైళ్లు నడిపే ఉద్దేశం లేదు: రైల్వే

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌కు శ్రామిక్ రైళ్లు నడిపే ప్రతిపాదన ఏదీ లేదని రైల్వే అధికారులు తెలిపారు. కర్ణాటక, తమిళనాడు, పంజాబ్, తెలంగాణ నుంచి వచ్చిన వలస కార్మికుల కోసం 8 రైళ్లను నడపాలని ఇప్పటికే ప్లాన్ చేసినట్టు తృణమూల్ కాంగ్రెస్ ప్రకటించడంతో రైల్వే అధికారులు ఈ ప్రకటన చేయడం గమనార్హం. హైదరాబాద్ నుంచి శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు ఓ రైలు బయలుదేరుతోందన్న టీఎంసీ వ్యాఖ్యలపై స్పందించిన రైల్వే అధికారులు రైలుకు సంబంధించి ఎటువంటి ప్రతిపాదన ఏదీ లేదని పేర్కొన్నారు. ఇండియన్ రైల్వే ఇప్పటి వరకు బెంగాల్‌కు రెండు రైళ్లు మాత్రమే నడిపింది. అందులో ఒకటి రాజస్థాన్ నుంచి కాగా, మరొకటి కేరళ నుంచి నడిపింది. 


శ్రామిక్ రైళ్లను నడిపేందుకు రైల్వే కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. దీని ప్రకారం.. ఈ రైళ్లు నడిపేందుకు ప్రయాణికుల సంఖ్యతోపాటు రెండు రాష్ట్రాల ప్రతిపాదనలు రావాలి. శనివారం రైల్వే శాఖ 47 రైళ్లను నడిపాలని నిర్ణయించగా అందులో ఒక్కటి కూడా బెంగాల్‌కు లేకపోవడం గమనార్హం. శ్రామిక్ రైళ్లను రాష్ట్రంలోకి అనుమతించడం లేదంటూ కేంద్రమంత్రి అమిత్ షా అబద్ధాలు చెబుతున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వం మండిపడింది.


తాము ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు, పంజాబ్, తెలంగాణ నుంచి ఎనిమిది రైళ్లను ప్లాన్ చేసినట్టు పేర్కొంది. కాగా, మమత బెనర్జీకి అమిత్ షా లేఖ రాస్తూ.. తాము రెండు లక్షల మంది వలస కార్మికులను స్వరాష్ట్రానికి తరలించాలని భావించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆశించిన మద్దతు రాలేదని అందులో పేర్కొన్నారు.  

Updated Date - 2020-05-09T22:45:23+05:30 IST