కొవిడ్‌పై రాజకీయాలు వద్దు: డబ్ల్యూహెచ్‌వో

ABN , First Publish Date - 2020-06-23T07:43:33+05:30 IST

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని చుట్టుముట్టిన ప్రస్తుత వాతావరణంలో ప్రపంచ దేశాల నాయకులు దీన్ని రాజకీయం చేయడం మాని, వైర్‌సను సంఘటితంగా కట్టడి చేసేందుకు కృషి చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) పిలుపునిచ్చింది...

కొవిడ్‌పై రాజకీయాలు వద్దు: డబ్ల్యూహెచ్‌వో

దుబాయ్‌ జూన్‌ 22: కరోనా వైరస్‌ ప్రపంచాన్ని చుట్టుముట్టిన ప్రస్తుత వాతావరణంలో ప్రపంచ దేశాల నాయకులు దీన్ని రాజకీయం చేయడం మాని, వైర్‌సను సంఘటితంగా కట్టడి చేసేందుకు కృషి చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) పిలుపునిచ్చింది.  సోమవారం దుబాయ్‌లోని వరల్డ్‌ గవర్నమెంట్‌ సమిట్‌లో పాల్గొన్న డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రో టెలికాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించారు. భారత్‌, బ్రెజిల్‌, ఇరాక్‌, అమెరికాలో కొవిడ్‌ కేసులు ప్రమాదకరస్థాయిలో పెరిగిపోతుండగా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తనను విమర్శించిన నేపథ్యంలో టెడ్రో ఈ వ్యాఖ్యలు చేశారు.  


Read more