సుశాంత్ కుటుంబం కోరితే సీబీఐతో దర్యాప్తు: నితీష్

ABN , First Publish Date - 2020-08-01T22:55:16+05:30 IST

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుట్ ఆత్మహత్య కేసుపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎట్టకేలకు..

సుశాంత్ కుటుంబం కోరితే సీబీఐతో దర్యాప్తు: నితీష్

పాట్నా: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుట్ ఆత్మహత్య కేసుపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎట్టకేలకు మౌనం వీడారు. సుశాంత్ సింగ్ కుటుంబ సభ్యులు కోరితే కేంద్ర దర్యాప్తు బృందానికి (సీబీఐ) కేసు అప్పగిస్తామని చెప్పారు. సుశాంత్ తండ్రి నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌పై విచారణ జరపడం పోలీసుల బాధ్యతని ఆయన చెప్పారు. జూన్ 14న సుశాంత్ సింగ్ తన నివాసంలో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.


అయితే, సుశాంత్ ప్రేయసిగా చెబుతున్న రియా చక్రవర్తి పేరు ఆ తర్వాత తెరపైకి వచ్చింది. తన కొడుకు డబ్బు, నగలను తీసుకుని పారిపోయిందని, అతడిని మానసిక ఒత్తిడికి గురి చేసి రియా చంపేసిందని సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బీహార్ పోలీసులు ముంబైలో ధర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలన్న డిమాండ్లు రావడంతో నితీష్ కుమార్ సన్నిహితుడు, రాష్ట్ర జనవరుల శాఖ మంత్రి సంజయ్ కుమార్ ఝా తొలిసారి స్పందించారు. సుశాంత్ కుటుంబ సభ్యులకు న్యాయం జరిగేలా చూసేందుకు ముఖ్యమంత్రి, ఆయన ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

Updated Date - 2020-08-01T22:55:16+05:30 IST