హాట్‌ టాపిక్‌గా మారిన సీఎం మమత బెనర్జీ తాజా నిర్ణయం

ABN , First Publish Date - 2020-05-18T22:30:08+05:30 IST

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ చేసిన తాజా ప్రకటన చర్చనీయాంశంగా మారింది. దేశవ్యాప్తంగా రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకూ...

హాట్‌ టాపిక్‌గా మారిన సీఎం మమత బెనర్జీ తాజా నిర్ణయం

సీఎం మమత బెనర్జీ కీలక నిర్ణయం

పశ్చిమ బెంగాల్‌లో అధికారిక నైట్ కర్ఫ్యూ ఉండదని ప్రకటన

కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ చేసిన తాజా ప్రకటన చర్చనీయాంశంగా మారింది. దేశవ్యాప్తంగా రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకూ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని లాక్‌డౌన్ తాజా మార్గదర్శకాల్లో భాగంగా కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూను అమలు చేయదని సీఎం మమత బెనర్జీ ప్రకటించడం కొసమెరుపు.


కేంద్రం ప్రకటించిన మార్గదర్శకాలను సడలింపుల పేరుతో రాష్ట్రాలు విచ్ఛిన్నం చేయొద్దని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. అయినప్పటికీ రాత్రి కర్ఫ్యూను విధించబోమని మమత ప్రకటించడం చర్చకు దారితీసింది. అంతేకాదు, కంటైన్మెంట్ ప్రాంతాల్లో తప్ప మిగిలిన అన్నిచోట్ల బిగ్ స్టోర్ట్స్ తెరుచుకోవచ్చని సీఎం మమత ప్రకటించారు.Updated Date - 2020-05-18T22:30:08+05:30 IST