హిమాచల్‌ప్రదేశ్‌లో ఐదు రోజులుగా కేసులు నిల్

ABN , First Publish Date - 2020-04-29T02:16:57+05:30 IST

హిమాచల్‌ప్రదేశ్‌లో గత ఐదు రోజులుగా ఒక్క కోవిడ్ కేసు కూడా నమోదు కాలేదని ఆరోగ్యశాఖ సీనియర్ అధికారి ఒకరు

హిమాచల్‌ప్రదేశ్‌లో ఐదు రోజులుగా కేసులు నిల్

సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో గత ఐదు రోజులుగా ఒక్క కోవిడ్ కేసు కూడా నమోదు కాలేదని ఆరోగ్యశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 41 కేసులు మాత్రమే నమోదయ్యాయని, యాక్టివ్‌గా ఉన్న కేసులు 10 మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. అలాగే, కరోనా బారినపడి ఇప్పటి వరకు ఇద్దరు వ్యక్తులు మరణించినట్టు తెలిపారు.


మంగళవారం 282 మంది శాంపిళ్లు పరీక్షలకు పంపగా 156 నెగటివ్ అని తేలినట్టు చెప్పారు. మిగతా వాటి ఫలితాలు రావాల్సి ఉందని అదనపు చీఫ్ సెక్రటరీ (హెల్త్) ఆర్‌డీ ధిమన్ తెలిపారు. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న కేసుల్లో నాలుగు ఉనా, చంబా, హమీర్‌పూర్‌లో చెరో రెండు, కంగ్రా, సిర్మౌర్‌లో చెరో కేసు ఉన్నట్టు వివరించారు. ఉనా జిల్లాకు చెందిన 12 మంది, సోలన్‌కు చెందిన ఐదుగురు, చంబాకు చెందిన నలుగురు, కంగ్రాకు చెందిన ముగ్గురు సిర్మౌర్‌కు చెందిన ఒకరు కోలుకున్నట్టు చెప్పారు.  

Updated Date - 2020-04-29T02:16:57+05:30 IST