ఉత్తరాఖండ్‌లో నేడు కొత్తగా కరోనా కేసులు లేవోచ్..

ABN , First Publish Date - 2020-04-08T04:46:43+05:30 IST

దేశంలోకి కరోనా ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటివరకు కరోనా బారిన పడని రాష్ట్రం లేదు. కొత్తగా కేసు నమోదు కాని రోజు లేదు. ఏ రాష్ట్రంలో చూసినా...

ఉత్తరాఖండ్‌లో నేడు కొత్తగా కరోనా కేసులు లేవోచ్..

డెహ్రాడూన్: దేశంలోకి కరోనా ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటివరకు కరోనా బారిన పడని రాష్ట్రం లేదు. కొత్తగా కేసు నమోదు కాని రోజు లేదు. ఏ రాష్ట్రంలో చూసినా ప్రతి రోజూ పదుల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఉదయం నిద్ర లేవగానే ఎన్ని కరోనా కేసులు నమోదవుతాయో అంటూ డాక్టర్లు కూడా భయపడే స్థితి ఆయా రాష్ట్రాల్లో నెలకొందంటే అతి శయోక్తి కాదు. అయితే ఉత్తరాఖండ్‌లో ఇప్పటివరకు 31మంది కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు. ప్రతీరోజు దాదాపుగా ఒకటి, రెండు కేసులు రాష్ట్రంలో నమోదవుతూనే ఉన్నాయి. అయితే మంగళవారం మాత్రం ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదవలేదని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనాతో బాధపడుతూ చికిత్స పొందుతున్న వారిలో కూడా చాలామంది కోలుకుంటున్నారని వివరించింది.

Read more