లాక్‌డౌన్ ప్రసక్తే లేదు: యడ్డీ
ABN , First Publish Date - 2020-06-16T07:43:58+05:30 IST
కర్ణాటకలో మరోసారి లాక్‌డౌన్ విధించే ప్రసక్తే లేదని సీఎం యడియూరప్ప తేల్చి చెప్పారు. అంతేగాక మరిన్ని వెసులుబాట్లు కల్పించే అవకాశం ఇవ్వాలని ప్రధాని మోదీని కోరతామన్నారు...

బెంగళూరు, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): కర్ణాటకలో మరోసారి లాక్‌డౌన్ విధించే ప్రసక్తే లేదని సీఎం యడియూరప్ప తేల్చి చెప్పారు. అంతేగాక మరిన్ని వెసులుబాట్లు కల్పించే అవకాశం ఇవ్వాలని ప్రధాని మోదీని కోరతామన్నారు. మంగళవారం ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ జరుగనున్న నేపథ్యంలో ముఖ్య అధికారులు, మంత్రులతో సీఎం సమీక్షించారు. వారంలో రెండు రోజులు రాష్ట్రమంతటా లాక్ డౌన్ అమలు చేస్తారనే ప్రచారాన్ని కొట్టిపారేశారు. మరిన్ని మినహాయింపులతో అన్ని వర్గాల ప్రజలకు ఉపాధి పెంచదలిచామన్నారు.