జాడ తెలియకుండా పోయిన సైనికులెవరూ లేరు..
ABN , First Publish Date - 2020-06-19T00:38:08+05:30 IST
చైనా బలగాలతో ఇటీవల చోటుచేసుకున్న ఘర్షణల్లో జాడ తెలియకుండా పోయిన భారత సైనికులు ఎవరూ లేరని ఇండియన్..
న్యూఢిల్లీ: చైనా బలగాలతో ఇటీవల చోటుచేసుకున్న ఘర్షణల్లో జాడ తెలియకుండా పోయిన భారత సైనికులు ఎవరూ లేరని ఇండియన్ ఆర్మీ వివరణ ఇచ్చింది. చైనా ఆర్మీ కస్టడీలో పలువురు భారత సైనికులు ఉన్నారంటూ వార్తలు వెలువడిన నేపథ్యంలో భారత ఆర్మీ ఈ వివరణ ఇచ్చింది. అయితే, చైనా కస్టడీ నుంచి సైనికులనెవరినైనా విడిచి పెట్టారా అనే దానిపై ఎలాంటి వ్యాఖ్య చేయలేదు.
'ఇన్ చైనా-ఇండియా క్లాష్ అనే పేరుతో న్యూయార్క్ టైమ్స్‌లో జూన్ 17న ఇద్దరు నేషనలిస్ట్ నాయకులు చెప్పిన దానికి ఇది వివరణ. జాడ తెలియకుండా పోయన భారత సైనికులెవరూ లేరు' అని ఇండియన్ ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది.
లడక్‌లోని గాల్వాన్ లోయలో చైనా బలగాలతో ఇటీవల జరిగిన ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. చైనా మాత్రం తమ వైపు మరణించిన, గాయపడిన వారికి సంబంధించిన అధికారిక లెక్కలు ఇంతవరకూ ప్రకటించలేదు. అయితే ఆ సంఖ్య 45 వరకూ ఉండవచ్చని భారత ఆర్మీ వర్గాల అంచనా.