తొమ్మిదేళ్ళుగా కత్తిరించుకోని జుట్టును... విరాళమిచ్చేశాడు

ABN , First Publish Date - 2020-08-20T21:53:34+05:30 IST

తొమ్మిదేళ్ళ ఓ బాలుడు చిన్నప్పటినుంచి జట్టు కత్తిరించుకోలేదు. అతడి క్రాఫ్‌ అతడికి... ఎనభయ్యవ దశకంలోని రాక్‌స్టార్ రూపాన్నిచ్చింది. గారెత్ బాలే నుంచి స్పూర్తిపొంది ఆ బాలుడు జుట్టును పెంచుకుంటూ వచ్చాడు. కాగా... ఓ రోజు... క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతూ జట్టుకోల్పోయిన పిల్లలను చూసి ఆ బాలుడు చలించిపోయాడు. వెంటనే తన జట్టు కత్తిరించి ఓ స్వచ్ఛంద సంస్థకు దానం చేసి, చిన్నవయసులో పెద్దమనసును చాటుకున్నాడు. సోషల్‌ మీడియాలో అందరి ప్రశంసలూ పొందాడు. వివరాలిలా ఉన్నాయి.

తొమ్మిదేళ్ళుగా కత్తిరించుకోని జుట్టును... విరాళమిచ్చేశాడు

లండన్‌ : తొమ్మిదేళ్ళ ఓ బాలుడు చిన్నప్పటినుంచి జట్టు కత్తిరించుకోలేదు. అతడి క్రాఫ్‌ అతడికి... ఎనభయ్యవ దశకంలోని రాక్‌స్టార్ రూపాన్నిచ్చింది. గారెత్ బాలే నుంచి స్పూర్తిపొంది ఆ బాలుడు జుట్టును పెంచుకుంటూ వచ్చాడు. కాగా... ఓ రోజు... క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతూ జట్టుకోల్పోయిన పిల్లలను చూసి ఆ బాలుడు చలించిపోయాడు. వెంటనే తన జట్టు కత్తిరించి ఓ స్వచ్ఛంద సంస్థకు దానం చేసి, చిన్నవయసులో పెద్దమనసును చాటుకున్నాడు. సోషల్‌ మీడియాలో అందరి ప్రశంసలూ పొందాడు. వివరాలిలా ఉన్నాయి.


లిటిల్ క్లాక్టన్‌కు చెందిన రీలీ స్టాన్‌కోంబ్‌కు బంగారు వర్ణపు జుత్తుంది. చిన్నప్పటినుంచీ ఎప్పుడూ కటింగ్‌ చేయించుకోలేదు. దీంతో అతడి జుట్టు రెండు అడుగుల కన్నా ఎక్కువగానే పెరిగింది. తన జుట్టును చూసుకుంటూ ఎప్పుడూ మురిసిపోతూ ఉండేవాడు. కాగా... క్యాన్సర్ కారణంగా జుట్టును కోల్పోయిన పిల్లల చిత్రాలను చూసిన తర్వాత జుట్టును కత్తిరించాలని నిర్ణయించుకున్నాడు.


అనుకున్నదే తడవు... రీల్లీ తన జుట్టును కత్తిరించుకుని లిటిల్ ప్రిన్సెస్ ట్రస్ట్ అనే సంస్థకు విరాళంగా ఇచ్చాడు. ఇది క్యాన్సర్ ఉన్న పిల్లలు ఉపయోగించే విగ్గుల తయారీకి ఉపయోగపడుతుంది. అదే క్రమంలో... అదే స్వచ్ఛంద సంస్థ కోసం 'గోఫండ్‌ మీ' పేజీని ప్రారంభించాడు. అతను మొదట్లో 100 డాలర్లు సేకరిచాలని అనుకున్నప్పటికీ అతడు జుట్టు ఇచ్చిన వార్త సోషల్‌మీడియాలో ప్రశంసలు అందుకున్న తర్వాత ఫండ్‌ 3,300 డాలర్లకు చేరుకుంది.


'ఇది చాలామందికి సంతోషాన్ని పంచుతుందని నేను భావిస్తున్నా. విగ్‌ పెట్టుకున్న పిల్లలు ఇతరుల మాదిరిగానే ఉంటారు.' అని రిల్లీ పేర్కొన్నాడు.

Updated Date - 2020-08-20T21:53:34+05:30 IST