స్ట్రెయిన్‌కు వ్యాక్సిన్‌పై కేంద్రం కీలక ప్రకటన
ABN , First Publish Date - 2020-12-30T01:23:18+05:30 IST
అయితే.. తొలుత ఎదుర్కొన్న కరోనా వైరస్‌తో పోల్చితే కరోనా స్ట్రెయిన్ ఇతరులకు వేగంగా సోకే అవకాశం ఉందని పేర్కొన్నారు. కరోనా మార్పు చెంది స్ట్రెయిన్‌గా మారిన్పటికీ...
స్ట్రెయిన్‌పై ప్రస్తుత వ్యాక్సిన్‌లు పనిచేయవని ఆధారాలేవీ లేవు: కేంద్రం
న్యూఢిల్లీ: కోవిడ్-19ను ఎదుర్కొనేందుకు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్‌లు కొత్త స్ట్రెయిన్ వైరస్‌పై పనిచేయవని ఆధారాలు లేవని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వ్యాక్సిన్ స్ట్రెయిన్‌పై కూడా పనిచేస్తుందని భారత ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ప్రొఫెసర్ కె.విజయ్ రాఘవన్ తెలిపారు. అయితే.. తొలుత ఎదుర్కొన్న కరోనా వైరస్‌తో పోల్చితే కరోనా స్ట్రెయిన్ ఇతరులకు వేగంగా సోకే అవకాశం ఉందని పేర్కొన్నారు. కరోనా మార్పు చెంది స్ట్రెయిన్‌గా మారిన్పటికీ, ఆ వైరస్ కేవలం మనిషి రోగనిరోధక శక్తిని మాత్రమే తగ్గించగలదని.. వ్యాక్సిన్ పనిచేయకుండా చేయగలిగే పరిస్థితి లేదని ఆయన తెలిపారు. అయితే.. వైరస్ మార్పు చెందుతున్న ఈ తరుణంలో మరింత అప్రమత్తత అవసరమని హెచ్చరించారు.
యూకేలో వెలుగుచూసిన కొత్త కరోనా స్ట్రెయిన్ వైరస్ అక్కడి నుంచి భారత్‌కు వచ్చిన వారిలో ఆరుగురికి సోకింది. వారికి ప్రస్తుతం చికిత్సనందిస్తున్నారు. డిసెంబర్ 23 నుంచి డిసెంబర్ 31 వరకూ యూకే నుంచి భారత్‌కు రాకపోకలను కేంద్రం ఇప్పటికే నిలిపివేసిన సంగతి తెలిసిందే.