ప్రాణాలు కోల్పోయిన వలస కూలీల డేటా లేదు : కేంద్రం

ABN , First Publish Date - 2020-09-14T19:24:29+05:30 IST

లాక్‌డౌన్ కారణంగా ఎంత మంది వలస కూలీలు తమ ప్రాణాలు కోల్పోయారన్న లెక్క తమ వద్ద లేదని కేంద్రం

ప్రాణాలు కోల్పోయిన వలస కూలీల డేటా లేదు : కేంద్రం

న్యూఢిల్లీ : లాక్‌డౌన్ కారణంగా ఎంత మంది వలస కూలీలు తమ ప్రాణాలు కోల్పోయారన్న లెక్క తమ వద్ద లేదని కేంద్రం పేర్కొంది. లాక్‌డౌన్ కారణంగా తమ తమ సొంత స్థలాలకు వెళ్లే క్రమంలో ఎంత మంది వలస కూలీలు చనిపోయారో చెప్పాలని విపక్ష నేతలు డిమాండ్ చేశారు. అలాంటి లెక్కలేవీ ప్రభుత్వం వద్ద లేవని కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోశ్ గాంగ్వర్ ప్రకటించారు. ఎంత మంది మరణించారన్న లెక్క తమ వద్ద లేకపోవడంతో నష్ట పరిహారం ప్రశ్నే ఉత్పన్నం కాదని కార్మిక శాఖ తెలిపింది.


లాక్‌డౌన్ సమయంలో తమిళనాడుకు చెందిన వలస కూలీలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్న వాదనపై ఆయన స్పందిస్తూ... ‘‘భారత దేశం చాలా పెద్దది. కోవిడ్ సమయంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్జీవోలు, మెడికల్ ఆఫీసర్లు, శానిటైజ్ వర్కర్లు మానవతా దృక్పథంతో చాలా చేశారు. తమిళనాడులో కూడా అనేక సేవలందించారు’’ అని సంతోశ్ గాంగ్వర్ తెలిపారు. 

Updated Date - 2020-09-14T19:24:29+05:30 IST