ఎల్‌ఏసీలో మార్పులను అంగీకరించం: రావత్‌

ABN , First Publish Date - 2020-11-07T06:54:27+05:30 IST

వాస్తవ అధీన రేఖ (ఎల్‌ఏసీ)లో ఎటువంటి మార్పులు చేసినా అంగీకరించే ప్రసక్తే లేదని మహా దళాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌ స్పష్టం చేశారు...

ఎల్‌ఏసీలో మార్పులను అంగీకరించం: రావత్‌

న్యూఢిల్లీ, నవంబరు 6: వాస్తవ అధీన రేఖ (ఎల్‌ఏసీ)లో ఎటువంటి మార్పులు చేసినా అంగీకరించే ప్రసక్తే లేదని మహా దళాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌ స్పష్టం చేశారు. తూర్పు లద్ధాఖ్‌లో దుస్సాహసానికి చైనాకు చెందిన పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ) ఇప్పటికే ‘అనూహ్య పరిణామాల’ను ఎదుర్కొంటోందని తెలిపారు. చైనాతో పూర్తిస్థాయి యుద్ధానికి అవకాశం లేదని, కానీ, మరిన్ని ఉల్లంఘనలు, ఘర్షణలకు పాల్పడితే సుదీర్ఘ పోరాటాన్ని తోసిపుచ్చలేమని తేల్చి చెప్పారు. భారత్‌, చైనా మధ్య శుక్రవారం ఎనిమిదో విడత కార్ప్స్‌ కమాండర్‌ స్థాయి చర్చలు జరిగాయి. ఎల్‌ఏసీ వెంట సైనిక ప్రతిష్టంభనపై చర్చించారు. అదే రోజు, నేషనల్‌ డిఫెన్స్‌ కాలేజీలో వర్చువల్‌గా జరిగిన ఓ సెమినార్‌లో ఆయన మాట్లాడారు. 

Updated Date - 2020-11-07T06:54:27+05:30 IST