పుద్దుచ్చేరి, తమిళనాడు రాష్ట్రాలను వణికిస్తోన్న ‘నివర్’

ABN , First Publish Date - 2020-11-26T12:30:05+05:30 IST

పుదుచ్చేరి, తమిళనాడు రాష్ట్రాలను నివర్ తుపాన్ వణికిస్తోంది.

పుద్దుచ్చేరి, తమిళనాడు రాష్ట్రాలను వణికిస్తోన్న ‘నివర్’

చెన్నై: పుదుచ్చేరి, తమిళనాడు రాష్ట్రాలను నివర్ తుపాన్ వణికిస్తోంది. పుదుచ్చేరి సమీపంలో బుధవారం రాత్రి 11.30 గంటల నుంచి గురువారం తెల్లవారుజామున 2.30 గంటల మధ్య నివర్‌ తుపాను తీరం దాటినట్లు వాతావరణశాఖ తెలియజేసింది.  ప్రస్తుతం నివర్ తుపాన్ అతి తీవ్ర తుపాన్ నుంచి తీవ్ర తుపాన్‌గా మారింది.  తుపాన్‌ తీరం దాటే సమయంలో భారీగా  పెనుగాలు వీచడంతో పెద్ద సంఖ్యలో వృక్షాలు, విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. మరో ఆరుగంటల్లో తుపాన్‌గా మారనుంది. రెండు రాష్ట్రాల్లో తుపాన్‌ ప్రభావంతో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. పుదుచ్చేరిలో లక్ష మందికిపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాదాపు 50 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. 

Updated Date - 2020-11-26T12:30:05+05:30 IST