నితీష్ కుమార్ బీహార్ సీఎం అవ్వరు...చిరాగ్ పాశ్వాన్ వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2020-11-03T12:59:35+05:30 IST

నవంబరు 10వతేదీ తర్వాత నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రి అవరని....

నితీష్ కుమార్ బీహార్ సీఎం అవ్వరు...చిరాగ్ పాశ్వాన్ వ్యాఖ్యలు

ఖగారియా (బీహార్): నవంబరు 10వతేదీ తర్వాత నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రి అవరని లోక్ జనశక్తి పార్టీ (ఎల్జెపీ) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ జోస్యం చెప్పారు. 4 లక్షలమంది బీహారీల సూచనలతో తాను డాక్యుమెంటు రాతపూర్వకంగా ఇస్తానని చిరాగ్ పేర్కొన్నారు. ప్రజలు అహంకారం కారణంగా పెద్ద నాయకులను కూడా అధికారం నుంచి తొలగిస్తారని చిరాగ్ చెప్పారు. నితీష్ కుమార్ కు బీహార్ అభివృద్ధిపై రోడ్ మ్యాప్ లేదన్నారు. ఇదిలా ఉండగా బీహార్ ప్రజలు మార్పు అనే సునామీలో నితీష్ పార్టీ కొట్టుకుపోతుందని మహా ఘట్పంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీయాదవ్ చెప్పారు. బీహార్ ప్రజలు విద్య, ఆరోగ్య సంరక్షణ, ద్రవ్యోల్బణం మొదలైన ఏజెండాలపై ఓటు వేస్తారని ఆయన చెప్పారు.

Updated Date - 2020-11-03T12:59:35+05:30 IST