సీఎంగా కొనసాగేందుకు నితీష్ అయిష్టంగా ఉన్నారు: సుశీల్ కుమార్ మోదీ

ABN , First Publish Date - 2020-12-28T23:58:02+05:30 IST

సీఎం పదవి చేపట్టేందుకు నితీష్ కుమార్ అయిష్టంగా ఉన్నారని సీనియర్ బీజేపీ నేత సుశీల్ కుమార్ మోదీ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు...

సీఎంగా కొనసాగేందుకు నితీష్ అయిష్టంగా ఉన్నారు: సుశీల్ కుమార్ మోదీ

పాట్నా: సీఎంగా కొనసాగేందుకు నితీష్ కుమార్ అయిష్టంగా ఉన్నారని సీనియర్ బీజేపీ నేత సుశీల్ కుమార్ మోదీ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. అంతేకాదు, ఎన్డీఏ ఆయన పేరుతో ఓట్లను పొందేందుకు కూడా ఆయన ఎన్నికలకు ముందు అంగీకరించారని చెప్పారు. ‘అరుణాచల్ ప్రదేశ్ ఎపిసోడ్’ తర్వాత నితీష్ మాట్లాడుతూ.. సీఎం పదవిపై తనకు కాంక్ష ఏమీ లేదని చేసిన వ్యాఖ్యలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. అరుణాచల్‌ప్రదేశ్‌లో ఆరుగురు జేడీయూ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి అధికార బీజేపీలో చేరారు.


దీంతో.. ఈశాన్య రాష్ట్రాల్లో జేడీయూ ప్రస్తుతం ఒక్క అసెంబ్లీ స్థానానికే పరిమితమైంది. అరుణాచల్‌ప్రదేశ్‌లో తమ బలాన్ని తగ్గించి.. తమ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ ఆ పార్టీలో చేర్చుకోవడంపై నితీష్ కొంత అసంతృప్తిలో ఉన్నట్లు సమాచారం. కూటమిగా ఉన్న రాజకీయ పార్టీ ఇలా చేయడం మంచి పరిణామం కాదని ఆయన వ్యాఖ్యానించినట్లు తెలిసింది.



Updated Date - 2020-12-28T23:58:02+05:30 IST