నీతి ఆయోగ్ కార్యాలయానికి సీల్...

ABN , First Publish Date - 2020-06-01T20:11:03+05:30 IST

కోవిడ్ పాజిటివ్‌తో సిబ్బంది ఒకరు మరణించడంతో ఢిల్లీలోని నీతి ఆయోగ్ కార్యాలయం ఉన్న మూడో ఫ్లోర్‌ను సోమవారం..

నీతి ఆయోగ్ కార్యాలయానికి సీల్...

న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ సిబ్బంది ఒకరికి కరోనా పాజిటివ్ ఉందని తేలడంతో ఢిల్లీలోని నీతి ఆయోగ్ కార్యాలయం ఉన్న మూడో ఫ్లోర్‌ను సోమవారం సీల్ చేశారు. ప్రస్తుతం శానిటేషన్ పనులు జరుగుతున్నాయి. ఈ వారం ప్రారంభంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో పని చేస్తున్న ఇద్దరు అధికారులకు వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చిన విషయం విదితమే. పాజిటివ్‌గా నిర్దారణ అయిన వారిలో ఒక వ్యక్తి ఢిల్లీలోని విదేశాంగ శాఖ సెంట్రల్ యూరోప్ డివిజన్లో పని చేస్తున్న అధికారి కాగా, మరొకరు న్యాయ విభాగంలో లీగల్ అధికారిగా పనిచేస్తున్నారు. సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్‌డీఎంసీ)లోని ఓ శానిటేషన్ ఉద్యోగి సైతం బదర్‌పూర్‌లో కోవిడ్‌తో కన్నుమూసినట్టు ఎస్‌డీఎంసీ అధికారి ఒకరు తెలిపారు.


మరోవైపు దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య 2 లక్షలకు చేరువలో ఉంది. సోమవారంనాటికి కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 1,90,535కు చేరినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వీటిలో 91,819 యాక్టివ్ కేసులు కాగా, 91,918 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్చి అయ్యారు. 5,394 మంది మృతి చెందారు.

Updated Date - 2020-06-01T20:11:03+05:30 IST