ఆర్థిక ప్యాకేజీ: 100 యూనివర్సిటీలకు కీలక అనుమతులు

ABN , First Publish Date - 2020-05-17T17:42:40+05:30 IST

ఆత్మ నిర్భర్‌ భారత్‌ ప్యాకేజీలోని చివరి దశ వివరాలను కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌ వెల్లడిస్తున్నారు.

ఆర్థిక ప్యాకేజీ: 100 యూనివర్సిటీలకు కీలక అనుమతులు

న్యూఢిల్లీ: ఆత్మ నిర్భర్‌ భారత్‌ ప్యాకేజీలోని చివరి దశ వివరాలను కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌ వెల్లడిస్తున్నారు. విద్యావిధానంలో టెక్నాలజీతో సమూల మార్పులు తీసుకొస్తున్నామన్నారు. వీడియో ఇంటరాక్టివ్‌ టెక్నాలజీతో విద్యార్థులకు క్లాసులు చెప్పేందుకు... ఇప్పటికే మూడు కొత్త చానెళ్లు రూపొందించామన్నారు. మరో 18 చానెళ్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. స్కైప్‌తో పాటు టాటాస్కై, ఎయిర్‌టెల్‌ లాంటి చానెళ్ల ద్వారా... ఈ వీడియో కాన్ఫరెన్స్‌ టెక్నాలజీ విద్యార్థుల ఇళ్లకు చేరుతుందన్నారు. ఉపాధ్యాయులకు విద్యార్థులకు మధ్య టెక్నాలజీ వారధిలా.. వినూత్న బోధనా విధానానికి ప్రయత్నిస్తున్నామన్నారు. 


స్కూళ్లలో డిజిటలైజేషన్‌కు అనుమతి ఇస్తున్నట్టు తెలిపారు. స్వయం ప్రభ డీటీహెచ్‌ సేవల ద్వారా ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తామన్నారు. ప్రతి రోజు 4గంటల పాటు ఆన్‌లైన్‌ క్లాసులు ఉంటాయన్నారు. ఈ-స్కూల్‌లో 200 కొత్త పుస్తకాలు, కొత్తగా 12 ఈ-విద్య ఆన్‌లైన్‌ ఛానెల్స్ అదుబాటులోకి తీసుకు వస్తున్నట్టు తెలిపారు. కొత్తగా పీఎం ఈ-విద్యను ప్రవేశపెడుతున్న నిర్మల తెలిపారు. 1-12 తరగతుల వరకు ఈ-విద్య కోసం ప్రత్యేకంగా ఒక్కో చానెల్‌, బధిరుల కోసం ప్రత్యేక ఈ-క్లాస్‌లు ఉంటాయన్నారు. ఆన్‌లైన్‌ కోర్సుల అమలుకు 100 వర్సిటీలకు అనుమతి ఇస్తున్నట్టు చెప్పారు. మనో దర్పణ్‌ స్కీమ్‌ ద్వారా విద్యార్థులకు, టీచర్లకు కౌన్సెలింగ్ ఇవ్వనున్నట్టు తెలిపారు. 

Updated Date - 2020-05-17T17:42:40+05:30 IST