సోనియాకు చేతులెత్తి మొక్కిన నిర్మలా సీతారామన్

ABN , First Publish Date - 2020-05-17T18:39:52+05:30 IST

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రంగా మండిపడ్డారు

సోనియాకు చేతులెత్తి మొక్కిన నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రంగా మండిపడ్డారు. వలస కార్మికుల విషయంలో రాజకీయాలు చేయడం తగదని ఆమె హితవు పలికారు. చివరి దశ ఆర్థిక ప్యాకేజీని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...


‘‘వలస కార్మికుల విషయంలో మనమందరమూ కలిసి పనిచేద్దాం. ప్రతిపక్షాలకు ఇదే నా విన్నపం. ఇప్పటికే అన్ని రాష్ట్రాలతో కలిసి పనిచేస్తున్నాం. వలస కార్మికుల విషయంలో మరింత బాధ్యతాయుతంగా మెలగాలి, ఆ విషయంలో మరింత బాధ్యతాయుతంగా మాట్లాడాలి. నేను చేతులు జోడించి సోనియాను వేడుకుంటున్నా. ఇదే నా విన్నపం’’ అని నిర్మలా విజ్ఞప్తి చేశారు.


కార్మికుల సమస్యలను పరిష్కరించే విషయంలో అత్యంత నిజాయితీగా వ్యవహరించాల్సింది పోయి, రాజకీయాలు చేస్తున్నారని రాహుల్ పై కూడా నిర్మలా విరుచుకుపడ్డారు. రాహుల్‌ ఇకనైనా నాటకాలు మానుకుంటే బాగుంటుందని నిర్మలా సీతారామన్ చురకలంటించారు. 

Updated Date - 2020-05-17T18:39:52+05:30 IST