దోషి పవన్‌ క్షమాభిక్ష పిటిషన్‌ తిరస్కృతి

ABN , First Publish Date - 2020-03-04T07:28:28+05:30 IST

నిర్భయ కేసు దోషులలో ఒకడైన పవన్‌ గుప్తా క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించాల్సిందిగా ఢిల్లీ ప్రభుత్వం లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌కు సిఫారసు చేసింది. పవన్‌కు క్షమాభిక్షకు...

దోషి పవన్‌ క్షమాభిక్ష పిటిషన్‌ తిరస్కృతి

లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు కేజ్రీ సర్కారు సిఫారసు


న్యూఢిల్లీ, మార్చి 3: నిర్భయ కేసు దోషులలో ఒకడైన పవన్‌ గుప్తా క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించాల్సిందిగా ఢిల్లీ ప్రభుత్వం లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌కు సిఫారసు చేసింది. పవన్‌కు క్షమాభిక్షకు సంబంధించిన ఫైలు కేంద్ర హోం మంత్రిత్వశాఖ నుంచి సోమవారం అందిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే కేజ్రీవాల్‌ ప్రభుత్వం దానిపై నిర్ణయం తీసుకుని బైజాల్‌కు పంపింది. బైజాల్‌ సిఫారసు చేసి కేంద్రానికి పంపుతారు. తర్వాత కేంద్ర హోం శాఖ దీన్ని రాష్ట్రపతి కోవింద్‌కు నివేదిస్తుంది. నిర్భయ కేసులో నలుగురు దోషులను మంగళవారం ఉదయం ఆరింటికి ఉరితీయాల్సి ఉండగా, కొన్ని గంటల మందు ట్రయల్‌ కోర్టు దాన్ని వాయిదా వేసిన సంగతి తెలిసిందే. పవన్‌ క్షమాభిక్ష పిటిషన్‌ పరిశీలనలో ఉండగా దోషులను ఉరితీయరాదని అదనపు సెషన్స్‌ జడ్జి ధర్మేంద్ర రాణా సోమవారం వ్యాఖ్యానించారు. 

Updated Date - 2020-03-04T07:28:28+05:30 IST