ఐదుగురిని చైనా సైన్యం అపహరించిందంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచల ఆరోపణలు

ABN , First Publish Date - 2020-09-05T15:00:08+05:30 IST

చైనాతో సరిహద్దు సమస్య కొనసాగుతుండగానే మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. అరుణాచల్

ఐదుగురిని చైనా సైన్యం అపహరించిందంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచల ఆరోపణలు

అరుణాచల్ ప్రదేశ్ : చైనాతో సరిహద్దు సమస్య కొనసాగుతుండగానే మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఐదుగురు స్థానికులను చైనా బలగాలు అపహరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఐదుగురు స్థానికులను చైనా సైన్యం అపహరించిందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నిన్నాంగ్ ఎరింగ్ ఆరోపించారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని సుబానాసిరి జిల్లాకు చెందిన ఐదుగురు స్థానికులను చైనా సైన్యం అపహరించిందని, గతంలో కూడా ఇలాంటివి జరిగాయని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు నిన్నాంగ్ ఎరింగ్ నేరుగా ప్రధాని కార్యాలయానికే ట్వీట్ చేశారు. 

Updated Date - 2020-09-05T15:00:08+05:30 IST