ముజఫర్ నగర్‌లో 9 మంది అంతర్రాష్ట్ర ఆయుధాల స్మగ్లర్ల అరెస్టు

ABN , First Publish Date - 2020-07-19T00:24:26+05:30 IST

ఆయుధాలను వివిధ రాష్ట్రాలకు అక్రమంగా తరలిస్తున్న ముఠాలోని తొమ్మిది మందిని

ముజఫర్ నగర్‌లో 9 మంది  అంతర్రాష్ట్ర ఆయుధాల స్మగ్లర్ల అరెస్టు

లక్నో : ఆయుధాలను వివిధ రాష్ట్రాలకు అక్రమంగా తరలిస్తున్న ముఠాలోని తొమ్మిది మందిని ఉత్తర ప్రదేశ్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ముజఫర్ నగర్‌ సమీపంలోని జౌలా గ్రామంలో వీరిని అరెస్ట్ చేసి, పెద్ద ఎత్తున ఆయుధాలను, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. 


ఉత్తర ప్రదేశ్ పోలీసులు విడుదల చేసిన ప్రకటనలో, నిందితుల నుంచి 75 పూర్తిగా తయారైన ఆయుధాలు, 45 తయారీలో ఉన్న ఆయుదాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆయుధాల తయారీకి ఉపయోగించే ఇతర పదార్థాలు, పరికరాలను కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. 45 దేశవాళీ తుపాకులు, 6 మస్కట్లు, ఒక గన్, 23 బాంబులు, 24 తయారీలో ఉన్న దేశవాళీ తుపాకులు, 4 బాంబుల కార్‌ట్రిడ్జ్‌లు, బ్యాటరీ, డ్రిల్ యంత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 


నిందితులు జౌలా గ్రామంలో చట్టవిరుద్ధంగా ఆయుధాల కర్మాగారాన్ని నడుపుతున్నట్లు తెలిపారు. 

Updated Date - 2020-07-19T00:24:26+05:30 IST