నకిలీ కాల్ సెంటర్‌తో ఘరానా మోసం.. 9 మంది అరెస్ట్..
ABN , First Publish Date - 2020-12-30T04:57:03+05:30 IST
నకిలీ కాల్ సెంటర్‌తో ఘరానా మోసం.. 9 మంది అరెస్ట్..
ఘజియాబాద్: కాల్ సెంటర్ పేరుతో అమాయకులకు టోకరా వేస్తున్న ఓ ముఠాను యూపీ పోలీసులు రట్టుచేశారు. లోనీలోని కంచన్‌పార్క్ కాలనీలో నకిలీ కాల్‌సెంటర్ నిర్వహిస్తున్న 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద రూ. 4.4 లక్షల నగదు, 22 సిమ్ కార్డులు, 45 ఏటీఎం కార్డులు, ఆరు చెక్‌బుక్‌లు, 24 మొబైల్ ఫోన్లు, 5 ఆధార్ కార్డులు, రెండు లగ్జరీ కార్లు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ అభిషేక్ వర్మ వెల్లడించారు. ‘‘నిందితులంతా కార్ షోరూం యజమానులమని చెప్పుకుంటూ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (ఆర్టీజీఎస్) ద్వారా డబ్బులు కాజేస్తున్నారు..’’ అని ఎస్పీ వెల్లడించారు.