కరోనా ఎఫెక్ట్: బ్రిటన్ విమానాన్ని సీజ్ చేసిన నైజీరియా..

ABN , First Publish Date - 2020-05-18T23:31:33+05:30 IST

నిబంధనలు ఉల్లఘించిన కారణంగా బ్రిటన్ సంస్థ ఫ్లెయిర్ ఏవీయేషన్‌కు చెందిన విమానాన్ని నైజీరియా ప్రభుత్వం సీజ్ చేసింది.

కరోనా ఎఫెక్ట్:  బ్రిటన్ విమానాన్ని సీజ్ చేసిన నైజీరియా..

అబుజా: నిబంధనలు ఉల్లఘించిన కారణంగా బ్రిటన్ సంస్థ ఫ్లెయిర్ ఏవీయేషన్‌కు చెందిన విమానాన్ని నైజీరియా ప్రభుత్వం సీజ్ చేసింది. అందులోని సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో నైజీరియా ఇటీవల అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం విధించింది. ఎయిర్ ఆంబులెన్స్, ఆహార రవాణా వంటి అత్యవసర సేవలు అందించే విమానాలు తప్ప ఇతర కార్యకలాపాలకు అనుమతి లేదని తెలిపింది. అయితే సహాయ చర్యలకు అనుమతి పొందిన ఫ్లెయిర్ ఏవీయేషన్..నిబంధనలను అతిక్రమించి సాధారణ ప్రయాణికులను తరలిస్తూ అక్కడి అధికారులకు చిక్కింది. దీంతో అధికారులు ఆ విమానాన్ని సీజ్ చేసి, సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా.. దీనిపై స్పందించిన ఆ దేశ పౌర విమానాయన శాఖ మంత్రి.. ఈ చర్యను ప్రమాదరకమైన అలసత్వంగా అభివర్ణించారు. తీవ్రమైన శిక్ష వేసి తీరుతామన్నారు. 

Updated Date - 2020-05-18T23:31:33+05:30 IST