8 నెలల్లో 1,675 మంది బాలలను కాపాడాం

ABN , First Publish Date - 2020-12-07T08:24:04+05:30 IST

లాక్‌డౌన్‌లో బాలల అక్రమ రవాణా పెరిగిపోయిందని, 1,675 మంది పిల్లలను ఆ బారి నుంచి కాపాడామని నోబెల్‌ గ్రహీత కైలాశ్‌ సత్యార్థికి చెందిన ఎన్జీఓ బచ్‌పన్‌ బచావో ఆందోళన్‌ తెలిపింది...

8 నెలల్లో 1,675 మంది బాలలను కాపాడాం

  • అక్రమ రవాణా పెరుగుదల.. ‘బచ్‌పన్‌ బచావో ఆందోళన్‌’ వెల్లడి


న్యూఢిల్లీ, డిసెంబరు 6: లాక్‌డౌన్‌లో బాలల అక్రమ రవాణా పెరిగిపోయిందని, 1,675 మంది పిల్లలను ఆ బారి నుంచి కాపాడామని నోబెల్‌ గ్రహీత కైలాశ్‌ సత్యార్థికి చెందిన ఎన్జీఓ బచ్‌పన్‌ బచావో ఆందోళన్‌ తెలిపింది. లాక్‌డౌన్‌ కారణంగా ఎనిమిది నెలలుగా చాలా మంది ఉపాధిని కోల్పోవడంతో అప్పులు చేశారని పేర్కొంది. ఈ పరిస్థితులు పిల్లల అక్రమ రవాణాకు తల్లిదండ్రులను ఒప్పుకునేలా చేశాయని చెప్పింది. పిల్లలను తరలిస్తే మంచి ఉపాధి దొరుకుతుందని అక్రమ రవాణా ముఠాలు తల్లిదండ్రులకు ఆశచూపాయని తెలిపింది. పిల్లలను పలు ప్రాంతాలకు తరలించి వారిలో చాలా మందితో రోజుకి 12 గంటల చొప్పున పని చేయించారని, జీతాలూ ఇవ్వలేదని వివరించింది.


Updated Date - 2020-12-07T08:24:04+05:30 IST