102 రోజుల తర్వాత.. న్యూజిలాండ్‌లో మళ్లీ కరోనా కేసులు!
ABN , First Publish Date - 2020-08-12T01:21:18+05:30 IST
దాదాపు 100 రోజుల నుంచి కరోనా కేసులు లేని న్యూజిలాండ్‌లో మరో కొత్త పాజిటివ్ కేసు నమోదైంది.

ఆక్లాండ్: దాదాపు 100 రోజుల నుంచి కరోనా కేసులు లేని న్యూజిలాండ్‌లో మరో కొత్త పాజిటివ్ కేసు నమోదైంది. 102 రోజుల తర్వాత నమోదైన తొలి కరోనా కేసు ఇదేనని న్యూజిలాండ్ ప్రభుత్వం తెలిపింది. న్యూజిలాండ్‌లో కొత్తగా కరోనా కేసులు నమోదు కాకపోవడంతో 102 రోజుల క్రితం తమ దేశం కరోనా ఫ్రీ అంటూ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పుడు తాజాగా న్యూజిలాండ్ రాజధాని ఆక్లాండ్‌లో కొత్తగా కరోనా కేసులు వెలుగుచూశాయి. ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి వైరస్ సోకినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రకటించిన న్యూజిలాండ్ ప్రధాని జకిండా ఆర్డెన్.. ఆక్లాండ్‌లో లాక్‌డౌన్ విధించనున్నట్లు ప్రకటించారు.