పత్రికలతో కరోనా వ్యాపించదు: ప్రపంచ ఆరోగ్య సంస్థ
ABN , First Publish Date - 2020-03-25T07:17:58+05:30 IST
వార్తాపత్రికలను తాకడం ద్వారా కరోనా వైరస్ సోకుతుందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వదంతులకు చెక్‌పెట్టేలా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలకు ఒక సర్క్యులర్ జారీ చేసింది. కరోనా ముప్పును ఎదుర్కోవడంలో భాగంగా ప్రజలకు....

ప్రజలకు నిరంతరాయ సమాచారమివ్వడంలో ముఖ్యపాత్ర
న్యూస్ పేపర్లు ఆగిపోకుండా చూడాలి: కేంద్రసర్కారు ఉత్తర్వు
పత్రికలతో కరోనా వ్యాపించదు : ప్రపంచ ఆరోగ్య సంస్థ
వార్తాపత్రికలతో కరోనా వ్యాపించదు
అవి సురక్షితం: ప్రపంచ ఆరోగ్య సంస్థ
న్యూఢిల్లీ(ఆంధ్రజ్యోతి): వార్తాపత్రికలను తాకడం ద్వారా కరోనా వైరస్ సోకుతుందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వదంతులకు చెక్‌పెట్టేలా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలకు ఒక సర్క్యులర్ జారీ చేసింది. కరోనా ముప్పును ఎదుర్కోవడంలో భాగంగా ప్రజలకు ఎప్పటికప్పుడు కచ్చితమైన, తాజా సమాచారాన్ని అందించడంలో వార్తాపత్రికలు కీలక పాత్ర పోషిస్తున్నాయని.. ఇది ఇలాగే కొనసాగాలంటే వార్తాపత్రికలు ఆగిపోకుండా ప్రజలకు అందేలా చూడటం ముఖ్యమని అందులో స్పష్టం చేసింది. వార్తాపత్రికలు, ఇతర మీడియా సంస్థల సేవలు కొనసాగేందుకు అవసరమైన ముద్రణ, సరఫరా, తదితర సౌకర్యాలకు ఎలాంటి ఆటంకాలూ లేకుండా చేయాలని సూచించింది. ‘‘ప్రజల్లో కరోనా వైర్‌సపై అవగాహన పెంచడానికి, ముఖ్యమైన సమాచారాన్ని అందించడానికే కాదు.. వైర్‌సకు సంబంధించి తాజా పరిణామాలను ఎప్పటికప్పుడు దేశ ప్రజలకు అందించడానికి, వదంతులు, ఊహాగానాలకు అడ్డుకట్ట వేయడానికి వార్తాసంస్థలు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా పనిచేయాల్సిన అవసరం ఉంది’’ అని సర్క్యులర్‌లో స్పష్టంగా పేర్కొంది.
మీడియా కూడా అత్యవసర సేవల్లో భాగమేనని, లాక్‌డౌన్ సమయంలో మీడియా పనిచేయాలని ప్రధాని నరేంద్ర మోదీ సైతం మార్చి 19న ప్రకటించిన సంగతి తెలిసిందే. అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం.. వార్తాపత్రికలను తాకొచ్చని, అవి సురక్షితమేనని తేల్చిచెప్పింది. మన ఇంటికి వచ్చే పేపర్లు కరోనా ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చినా అవి సురక్షితమేనని, ముద్రణ నుంచి ఇళ్లకు చేరే దాకా అనేక దశల్లో, పలు వాతావరణాల్లో ప్రయాణించే వార్తాపత్రికల ద్వారా వైరస్ సోకే అవకాశాలు చాలా తక్కువని తెలిపింది. అమెరికాకు చెందిన ‘సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్’ కూడా న్యూస్‌పేపర్ల ద్వారా వైరస్ వ్యాపించే ముప్పు చాలా త క్కువని స్పష్టం చేసింది. ఇక, వైరస్ ఉధృతి ఇంత ఎక్కువగా ఉన్నా.. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలోనూ వార్తాపత్రికలు మూతపడలేదని సాంక్రమిక వ్యాధులపై మహారాష్ట్ర ప్రభుత్వ సాంకేతిక సలహాదారు డాక ్టర్ సుభాష్ సాలుంకే అ న్నారు. వార్తాపత్రికల ముద్రణ నుంచి ప్యాకింగ్ దాకా ఆటోమేటెడ్ పద్ధతులే అమలవుతున్నాయని, వాటిని పట్టుకుని చదవడం పూర్తిగా సురక్షితమన్నారు. కరోనా వైరస్ మనుగడ సాగించాలంటే దానికి జీవకణాలు కావాలని.. నిర్మాణరీత్యా సూక్ష్మమైన రంధ్రాలు ఉండే, జీవం లేని పేపర్లపై ఆ వైరస్ ఎక్కువ సేపు మనుగడ సాగించలేదని.. న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురితమైన తాజా అధ్యయనం స్పష్టం చేసింది. దాని ప్రకారం.. రాగి అణువుల అమరిక కారణంగా రాగి పాత్రలు, వస్తువులపై వైరస్ అతి తక్కువ సమయం మనుగడ సాగిస్తుంది. ప్లాస్టిక్, స్టెయిన్‌లె్‌స స్టీల్ వస్తువులపై ఎక్కువ సేపు ఉంటుంది. అయితే.. జీవం లేని ఏ ఉపరితలంపైన అయినా పడిన తర్వాత ప్రతి 66 నిమిషాలకూ వైరస్ తన శక్తిలో సగాన్ని కోల్పోతుంటుంది. ఈ క్రమంలో.. 3 గంటల తర్వాత ఆ(ఉపరితలంపై ఉన్న) వైర్‌సను తాకిన వారు ఇన్ఫెక్షన్‌కు గురయ్యే ప్ర మాదం 1/8వ వంతుకు పడిపోతుంది. 6 గంటల తర్వాత ఆ ముప్పు 2 శాతానికి త గ్గిపోతుంది. కాబట్టి వార్తాపత్రికలతో వైరస్ వ్యాపించే ముప్పు తక్కువేనన్నది ఆ అధ్యయనం సారాంశం.
పత్రికలకు విశ్వసనీయత అద్భుతం: ప్రధాని మోదీ