కరోనా కొత్త లక్షణాలివే.. ఇవేవీ మీలో లేవుగా..!

ABN , First Publish Date - 2020-07-05T22:10:24+05:30 IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి రోజురోజుకూ కొత్త లక్షణాలతో...

కరోనా కొత్త లక్షణాలివే.. ఇవేవీ మీలో లేవుగా..!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి రోజురోజుకూ కొత్త లక్షణాలతో విరుచుకుపడుతోంది. ఇప్పటివరకూ జలుబు, తుమ్ములు, జ్వరం, దగ్గునే కరోనా ప్రధాన లక్షణాలుగా పరిగణించారు. కరోనా బారిన పడుతున్న వారిలో ఎక్కువగా ఈ లక్షణాలే కనిపించాయి. కొందరు వాసన గ్రహించే శక్తిని కోల్పోయి ఈ వైరస్ బారిన పడ్డారు.


మరికొందరిలో.. ఏ లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే.. కొత్తగా తలనొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న వారికి కూడా వైరస్ సోకుతున్నట్లు తెలిసింది. దీంతో.. ఇన్నాళ్లూ కరోనా ఊపిరితిత్తుల పైనే ప్రభావం చూపుతోందని భావించిన వైద్యులకు ఈ కొత్త లక్షణాలు సవాల్ విసురుతున్నాయి. 


తలనొప్పి, వాంతులు, విరేచనాలను సాధారణ అనారోగ్య సమస్యలుగా పరిగణించరాదని, ఈ మూడు లక్షణాల్లో ఏ ఒక్కటి కనిపించినా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం మేలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. అయితే.. సెంటర్స్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) ఈ మూడింటితో పాటు మరో మూడు లక్షణాలను కరోనా లక్షణాలుగా ఏప్రిల్‌లోనే ప్రకటించింది. అయితే.. కరోనా బారిన పడుతున్న వారిలో ఇవి కొత్తగా కనిపిస్తున్న లక్షణాలని వైద్యులు చెబుతున్నారు. 


సీడీసీ ప్రకారం కరోనా లక్షణాల మొత్తం జాబితా...


1. జ్వరం లేదా చలి జ్వరం

2. దగ్గు

3. శ్వాస అందకపోవడం లేదా శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపించడం

4. ఆయాసం

5. ఒంటి నొప్పులు లేదా కండరాల నొప్పులు

6. తలనొప్పి

7. రుచి తెలియకపోవడం లేదా వాసన గ్రహించే శక్తిని కోల్పోవడం

8. గొంతునొప్పి

9. జలుబు

10. వాంతులు

11. విరేచనాలు

Updated Date - 2020-07-05T22:10:24+05:30 IST