భీమ్ ఆర్మీ చీఫ్ నేతృత్వంలో త్వరలో కొత్త రాజకీయ పార్టీ

ABN , First Publish Date - 2020-03-12T20:48:58+05:30 IST

భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ఆదివారం నూతన రాజకీయ పార్టీని ప్రకటించబోతున్నారు. బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్ జయంతి సందర్భంగా ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఆయన ఈ ప్రకటన...

భీమ్ ఆర్మీ చీఫ్ నేతృత్వంలో త్వరలో కొత్త రాజకీయ పార్టీ

లక్నో : భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ఆదివారం నూతన రాజకీయ పార్టీని ప్రకటించబోతున్నారు. బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్ జయంతి సందర్భంగా ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఆయన ఈ ప్రకటన చేయబోతున్నట్లు భీమ్ ఆర్మీ అధికార ప్రతినిథి తెలిపారు. తమ పార్టీ మేనిఫెస్టోను ఆదివారం విడుదల చేస్తామని చెప్పారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం ఆదివారం ప్రారంభమవుతుందన్నారు. 


భీమ్ ఆర్మీకి విద్యార్థి విభాగం కూడా ఉందన్నారు. భీమ్ ఆర్మీ స్టూడెంట్స్ ఫెడరేషన్ పేరుతో విద్యార్థులను చైతన్యవంతం చేస్తోందన్నారు. నూతన పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత భీమ్ ఆర్మీ సాంఘిక, సాంస్కృతిక సంస్థగా పని చేస్తుందని తెలిపారు. 


కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు అవసరం గురించి భీమ్ ఆర్మీ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తోంది. తమ పార్టీలో దళితులు, వెనుకబడిన వర్గాలు, ముస్లింలు చేరాలని, మద్దతివ్వాలని కోరుతోంది.


Updated Date - 2020-03-12T20:48:58+05:30 IST