పశ్చిమ బెంగాల్‌లో తాజా పరిస్థితిపై క్లారిటీ ఇచ్చిన మమతా

ABN , First Publish Date - 2020-05-19T00:11:05+05:30 IST

రాష్ట్రంలో కంటైన్‌మెంట్ జోన్లను ఏ, బీ, సీ అనే అనే మూడు భాగాలుగా విభజిస్తున్నట్లు మమతా ప్రకటించారు. జోన్‌ ఏలో పూర్తి స్థాయి లాక్‌డౌన్ అమలు జరుగుతుందని, జోన్ బీలో కొంత మేరకు సడలింపులు ఉంటాయని, జోన్‌ సీలో

పశ్చిమ బెంగాల్‌లో తాజా పరిస్థితిపై క్లారిటీ ఇచ్చిన మమతా

కోల్‌కతా: నాలుగో విడత లాక్‌డౌన్‌ను మే 31 వరకు కేంద్రం పొడగించిన అనంతరం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సైతం మే 31 వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్ పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ విషయాన్ని సోమవారం సాయంత్రం ప్రకటించారు. లాక్‌డౌన్ పొడగింపు ప్రకటన చేస్తూనే తదుపరి పరిపాలనా ఇతర వ్యవహరాలపై ఆమె స్పష్టతనిచ్చారు.


రాష్ట్రంలో కంటైన్‌మెంట్ జోన్లను ఏ, బీ, సీ అనే అనే మూడు భాగాలుగా విభజిస్తున్నట్లు మమతా ప్రకటించారు. జోన్‌ ఏలో పూర్తి స్థాయి లాక్‌డౌన్ అమలు జరుగుతుందని, జోన్ బీలో కొంత మేరకు సడలింపులు ఉంటాయని, జోన్‌ సీలో సంపూర్ణ సడలింపులు ఉంటాయని ఆమె తెలిపారు. ఇక మే 21 తర్వాత రాష్ట్రంలోని చిన్న, పెద్ద దుకాణాలన్నీ తెరవనున్నట్లు ప్రకటించారు. అయితే ప్రజలు బయటికి వెళ్తే తప్పనిసరిగా మాస్కులు ధరించాలని అన్నారు. దానితో పాటు సానిటైజేషన్ కూడా తప్పనిసరి అని మమతా అన్నారు.


‘‘భౌతిక దూరం పాటిస్తూ హోటల్స్ నడిపించుకోవచ్చు. రెస్టారెంట్లు తెరిచేందుకు అనుమతి లేదు. ప్రేక్షకులు లేకుండా ఆటలు ఆడించుకోవచ్చు. ఇద్దరు వ్యక్తులతో ఆటోలు నడిపించవచ్చు. సెలూన్లు, బ్యూటీ పార్లర్లు తెరవవచ్చు. అయితే సెలూన్లు, బ్యూటీ పార్లర్లను క్రిమిరహితంగా నిర్వహించాలి’’ అని మమతా బెనర్జీ అన్నారు.

Updated Date - 2020-05-19T00:11:05+05:30 IST