బీమా పాలసీల ప్రీమియంకూ ఎల్‌టీసీ నగదు ఓచర్‌ పథకం

ABN , First Publish Date - 2020-11-27T07:23:27+05:30 IST

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎల్‌టీసీ నగదు ఓచర్‌ పథకం కింద మరో ప్రయోజనం కూడా పొందే అవకాశం కల్పించారు. ఇందులో భాగంగా 2020 అక్టోబరు 12 నుంచి 2021 మార్చి 31 వరకు కొత్తగా కొనుగోలు చేసిన బీమా పాలసీలకు

బీమా పాలసీల ప్రీమియంకూ ఎల్‌టీసీ నగదు ఓచర్‌ పథకం

ఎల్‌టీసీ నగదు ఓచర్‌తో కొత్త బీమా పాలసీలు కట్టుకోవచ్చు

ఉద్యోగులకు కేంద్రం వరం

మార్చి 31 వరకు అవకాశం


న్యూఢిల్లీ, నవంబరు 26: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎల్‌టీసీ నగదు ఓచర్‌ పథకం కింద మరో ప్రయోజనం కూడా పొందే అవకాశం కల్పించారు. ఇందులో భాగంగా 2020 అక్టోబరు 12 నుంచి 2021 మార్చి 31 వరకు కొత్తగా కొనుగోలు చేసిన బీమా పాలసీలకు చెల్లించిన ప్రీమియంకు ఈ పథకం కింద రీయింబర్స్‌మెంట్‌ పొందవచ్చు. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని వ్యయా ల విభాగం తరచూ అడిగే ప్రశ్నలకు ఇచ్చిన స మాధానంలో పేర్కొంది. ఇప్పటికే తీసుకున్న బీ మా పాలసీలకు చెల్లించిన ప్రీమియంకు ఎల్‌టీసీ నగదు ఓచర్‌ పథకం వర్తించదని తెలిపింది. ఈ పథకం కింద ప్రయోజనం పొందాలనుకుంటే ఓచర్లు/బిల్లులను 2021 మార్చి 31 వరకు సమర్పించాలని తెలిపింది. కార్లు వంటి వాటిని కొనుగోలు చేసిన ఉద్యోగులు ఈ పథకం కింద ప్రయోజనం పొందాలంటే ఒరిజినల్‌ బిల్లులకు బదులుగా సెల్ఫ్‌ అటెస్టెడ్‌ ఫొటో కాపీని సమర్పించవచ్చని పేర్కొం ది. ఎల్‌టీసీ నగదు ఓచర్‌ పథకం కింద ఉద్యోగులు 12 శాతం లేదా అంతకన్నా ఎక్కువ జీఎస్టీ కలిగిన ఉత్పత్తులు లేదా సర్వీసులను కొనుగోలు చేసి ప్రయోజనం పొందే అవకాశం కల్పించారు. 

Read more