కొత్త వైద్యులూ.. తక్షణమే విధుల్లో చేరండి

ABN , First Publish Date - 2020-03-30T10:17:55+05:30 IST

కేంద్ర సాయుధ పోలీసు దళాల (సీఏపీఎ్‌ఫ)లో కొత్తగా నియమితులైన 450 మంది వైద్యాధికారులను తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశించినట్లు ఐటీబీపీ డీజీ సుర్జీత్‌సింగ్‌ దేస్వాల్‌ చెప్పారు. కరోనాపై పోరును ముమ్మరం చేసేందుకు

కొత్త వైద్యులూ.. తక్షణమే విధుల్లో చేరండి

  • 450 మంది సీఏపీఎఫ్‌ వైద్యాధికారులకు ఐటీబీపీ డీజీ ఆదేశం

న్యూఢిల్లీ, మార్చి 29: కేంద్ర సాయుధ పోలీసు దళాల (సీఏపీఎ్‌ఫ)లో కొత్తగా నియమితులైన 450 మంది వైద్యాధికారులను తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశించినట్లు ఐటీబీపీ డీజీ సుర్జీత్‌సింగ్‌ దేస్వాల్‌ చెప్పారు. కరోనాపై పోరును ముమ్మరం చేసేందుకు సాయుధ బలగాల ఆరోగ్య విభాగాన్ని సన్నద్ధం చేస్తున్నామని, ఇందులో భాగంగా పదవీ విరమణ చేసిన వైద్యాధికారులను కూడా అప్రమత్తం చేసినట్లు దేస్వాల్‌ ఆదివారం వెల్లడించారు. అలాగే కాంట్రాక్టు పద్ధతిలోనూ వైద్య సిబ్బంది తీసుకునేందుకు విధివిధానాలను రూపొందిస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా అన్ని సాయుధ బలగాల ఆస్పత్రుల్లో 7200కు పైగా పడకలు అందుబాటులో ఉన్నాయని వివరించారు.

Updated Date - 2020-03-30T10:17:55+05:30 IST