మరో 62 మంది సీఆర్పీఎఫ్ సిబ్బందికి కోవిడ్-19 పాజిటివ్
ABN , First Publish Date - 2020-05-10T02:45:12+05:30 IST
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది.
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కోవిడ్-19 కట్టడి చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మే 17 వరకు లాక్ డౌన్ ను పొడిగించింది. అయినప్పటికీ రోజురోజుకూ దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఇటు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కూడా కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో మరో 62 మంది సీఆర్పీఎఫ్ సిబ్బందికి కోవిడ్-19 పాజిటివ్ వచ్చినట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. శనివారం సాయంత్రం నాటికి అందిన సమాచారం మేరకు మొత్తం 231 మంది సీఆర్పీఎఫ్ సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. కరోనా వైరస్ నుంచి ఇద్దరు కోలుకున్నారని చెప్పారు.