ర్యాపిడ్ యాంటీ బాడీ టెస్ట్.. కచ్చితత్వం@ 100%

ABN , First Publish Date - 2020-05-10T04:03:09+05:30 IST

ర్యాపిడ్ యాంటీ బాడీ టెస్టులు.. ఆర్‌టీ పీసీఆర్ ఆధారిత కరోనా నిర్ధారణ పరీక్షల కంటే వేగవంతమైనవి. నిమిషాల వ్యవధిలోనే ఫలితాలను ఇవ్వగలవు. కానీ వీటి కచ్చితత్వంపై సందేహాలు వెలువడటంతో ప్రభుత్వం వీటికి స్వస్థి పలికింది. అయితే ప్రముఖ ఫార్మా కంపెనీ ఆబట్.. కొత్త ర్యాపిడ్ యాంటీబాడీ టెస్టుతో ముందుకు వచ్చింది.

ర్యాపిడ్ యాంటీ బాడీ టెస్ట్.. కచ్చితత్వం@ 100%

వాషింగ్టన్: ర్యాపిడ్ యాంటీ బాడీ టెస్టులు.. ఆర్‌టీ పీసీఆర్ ఆధారిత కరోనా నిర్ధారణ పరీక్షల కంటే వేగవంతమైనవి. నిమిషాల వ్యవధిలోనే ఫలితాలను ఇవ్వగలవు. కానీ వీటి కచ్చితత్వంపై సందేహాలు వెలువడటంతో ప్రభుత్వం వీటికి స్వస్థి పలికింది. అయితే ప్రముఖ ఫార్మా కంపెనీ ఆబట్.. కొత్త ర్యాపిడ్ యాంటీబాడీ టెస్టుతో ముందుకు వచ్చింది. ఏమాత్రం తప్పులు దొర్లకుండా ఫలితాలను వెలువరించడమే ఈ కిట్ విశిస్టత. దీని సెన్సిటివీటి రేటు 100 శాతం అయితే స్పెసిఫిసిటీ రేటు 99.9శాతం. అంటే ఈ టెస్టు ద్వారా మనిషి శరీరంలో కరోనా నిరోధక యాంటీబాడీలు ఉన్నదీ లేనిది కచ్చితంగా చెప్పవచ్చనమాట. యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్ జరిపిన పరిశోధనల్లోనూ ఈ కిట్ కచ్చిత్వం నిరూపితమైంది. అత్యవసర పరిస్థితుల్లో దీన్ని వినియోగించేందుకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి సంస్థకు లభించింది. ఇప్పటికే ఈ కంపెనీ కోటి కిట్లను వివిధ ఆస్పత్రులకు, ల్యాబ్‌లకు పంపించిందట కూడా. 

Updated Date - 2020-05-10T04:03:09+05:30 IST