మహారాష్ట్రలో కొత్తగా 1230 కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-05-12T03:38:40+05:30 IST

దేశాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో ఈ వైరస్ విజృంభిస్తోంది.

మహారాష్ట్రలో కొత్తగా 1230 కరోనా కేసులు

ముంబై: దేశాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో ఈ వైరస్ విజృంభిస్తోంది. ఈ క్రమంలో మహారాష్ట్రలో సోమవారం ఒక్కరోజులోనే 1,230 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అంతేగాక మరో 36మంది కరోనా బాధితులు మరణించినట్లు తెలిపారు. దీంతో మహారాష్ట్రలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 23,401కి చేరింది. అలాగే మొత్తం కరోనా మరణాల సంఖ్య 868గా ఉంది. వీటిలో అత్యధికం ముంబై మహానగరంలోనే ఉండటం గమనార్హం.

Updated Date - 2020-05-12T03:38:40+05:30 IST