మహాత్మా గాంధీపై కొత్త పుస్తకం

ABN , First Publish Date - 2020-12-27T09:51:18+05:30 IST

మహాత్మా గాంధీపై రాసిన ‘మేకింగ్‌ ఆఫ్‌ హిందూ పేట్రియాట్‌: బ్యాక్‌గ్రౌండ్‌ ఆఫ్‌ గాంధీజీస్‌ హింద్‌ స్వరాజ్‌’ అనే కొత్త పుస్తకాన్ని జనవరి 1న

మహాత్మా గాంధీపై కొత్త పుస్తకం

1న ఆవిష్కరించనున్న ఆర్‌ఎస్ఎస్‌ చీఫ్‌ 


న్యూఢిల్లీ, డిసెంబరు 26: మహాత్మా గాంధీపై రాసిన ‘మేకింగ్‌ ఆఫ్‌ హిందూ పేట్రియాట్‌: బ్యాక్‌గ్రౌండ్‌ ఆఫ్‌ గాంధీజీస్‌ హింద్‌ స్వరాజ్‌’ అనే కొత్త పుస్తకాన్ని జనవరి 1న రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ ఆవిష్కరించనున్నారు. ధర్మ అనే అంశంపై గాంధీ రాసిన ‘హింద్‌ స్వరాజ్‌’ అనే పుస్తకం 1909లో గుజరాతీ భాషలో, 1910లో దాని ఇంగ్లీష్‌ అనువాదం ప్రచురణ అయింది. గాంధీ చేతిరాతతో ఉన్న ‘హింద్‌ స్వరాజ్‌’ ఆధారంగా ఈ ప్రామాణిక ఎడిషన్‌ను రూపొందించినట్లు దాని రచయితలు సెంటర్‌ ఫర్‌ పాలసీ స్టడీస్‌ వ్యవస్థాపక డైరెక్టర్‌  జేకే బజాజ్‌,  దాని వ్యవస్థాపక చైర్మన్‌ ఎండీ శ్రీనివాస్‌ చెప్పారు. గాంధీ ఎప్పుడూ తనను తాను హిందువుగా భావించేవారని, ఆయన గొప్ప హిందూ దేశభక్తుడని వారు పేర్కొన్నారు.

Updated Date - 2020-12-27T09:51:18+05:30 IST