ఇవే నా చివరి ఎన్నికలని చెప్పలేదు: నితీష్
ABN , First Publish Date - 2020-11-13T22:26:43+05:30 IST
భవిష్యత్తులో కూడా తాను పని చేయాల్సి వస్తే ఇదేరకమైన అంకితభావంతో పని చేస్తానని ..
పాట్నా: ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికలే తన చివరి ఎన్నికలని తాను చెప్పలేదని జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ అన్నారు. తాను చెప్పిన మాటలను మీడియా తప్పుగా అర్ధం చేసుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా తాను పని చేయాల్సి వస్తే ఇదేరకమైన అంకితభావంతో పని చేస్తానని ఆయన స్పష్టం చేశారు. 'రిటైర్‌మెంట్ గురించి నేను చెప్పలేదు. అంతా సజావుగా జరుగుతుందని, అంతా సజావుగా ముగుస్తుందని నేను ప్రతి ఎన్నికల్లో చెబుతుంటాను. గత ఎన్నికల ర్యాలీలోనూ ఇదే చెప్పాను. నా పూర్తి ప్రసంగం మరోసారి వింటే మీకే అర్ధమవుతుంది' అని జేడీయూ సుప్రీం అన్నారు. బీహార్ ఎన్నికల ప్రచారం చివర దశలో నితీష్ ఇవే తన చివరి ఎన్నికలని ప్రకటించినట్టు మీడియాలో వార్తా కథనాలు వచ్చాయి. పోరాటానికి ముందే నితీష్ చేతులెత్తేశారని, తన ప్రకటనతో ఓటమిని అంగీకరించరని విపక్ష మహాఘట్ బంధన్ నేతలు విమర్శలు సైతం ఎక్కుపెట్టారు.