విమర్శిస్తే అరెస్టులా.. ఉద్ధవ్‌పై నెటిజన్ల ఆగ్రహం.. విడుదలకు డిమాండ్
ABN , First Publish Date - 2020-10-25T01:04:15+05:30 IST
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేను విమర్శించినందుకు గానూ సమీత్ థక్కర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై ఆందోళనలు పెల్లుబికుతున్నాయి. మహా సర్కార్ విధానాలను ఎండగడుతూ సోషల్ మీడియాలో...

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేను విమర్శించినందుకు గానూ సమీత్ థక్కర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై ఆందోళనలు పెల్లుబికుతున్నాయి. మహా సర్కార్ విధానాలను ఎండగడుతూ సోషల్ మీడియాలో అనేకమంది పోస్టులు పెడుతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని చూసి కూడా చూడనట్లు వ్యవహరిస్తున్న పెంగ్విన్ సీఎం ఉద్ధవ్ అంటూ విమర్శలు సంధిస్తున్నారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే చేతకాని తనాన్ని ఎత్తి చూపిస్తే అరెస్టు చేస్తారా..? ఈ మాత్రం సత్తా రేపిస్టులపై, అవినీతి పరులపై పోలీసులు చూపిస్తే బాగుటుంది.. అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సమీత్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ #ReleaseSameetThakkar అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. నిముషాల వ్యవధిలోనే ఈ హ్యాష్‌ట్యాగ్‌పై 15వేలకు పైగా ట్వీట్లు పోస్టయ్యాయి.
ఇదిలా ఉంటే సమీత్ థక్కర్ ఇటీవల చేసి ట్వీట్లో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే, ఆయన తనయుడు ఆదిత్య థాక్రేలను విమర్శించారు. ముఖ్యమంత్రిగా ఉన్నా ఉద్ధవ్ అసమర్థ పాలన చేస్తున్నారని, ఆయనో పెంగ్విన్ సీఎం అని ట్వీట్ చేశారు. అంతే కాకుండా ఆయన కుమారుడు ఆదిత్య థాక్రేను బేబీ పెంగ్విన్ అంటూ ఎగతాళి చేశారు. దీంతో పోలీసులు సమీత్ ను అరెస్ట్ చేశారు.
