సుశాంత్ విషయంలో సీబీఐ ఏం చేస్తున్నావ్..? నెటిజన్ల సూటి ప్రశ్న

ABN , First Publish Date - 2020-10-25T00:48:32+05:30 IST

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణించి 3 నెలలు గడుస్తున్నా ఎటువంటి పురోగతి లేకపోవడంపై సోషల్‌ మీడియాలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా 65 రోజులుగా..

సుశాంత్ విషయంలో సీబీఐ ఏం చేస్తున్నావ్..? నెటిజన్ల సూటి ప్రశ్న

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణించి 3 నెలలు గడుస్తున్నా ఎటువంటి పురోగతి లేకపోవడంపై సోషల్‌ మీడియాలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా 65 రోజులుగా విచారణ కొనసాగిస్తున్న సీబీఐ దర్యాప్తుపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్ని రోజులుగా సీబీఐ ఏ ఒక్కరినీ కస్టడీలోకి తీసుకోలేదని, విచారణలో కావాలనే తీవ్ర జాప్యం చేస్తోందనే ఆరోపణలు సైతం వస్తున్నాయి. సుశాంత్‌ది ముమ్మాటికీ హత్యేనని, దోషులకు ఎలాగైనా కఠిన శిక్ష పడేలా చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని, కేంద్ర ప్రభత్వాన్ని కోరుతూ వేల మంది పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే #302B4Election4SSR అనే హ్యాష్‌ట్యాగ్‌ను వైరల్‌ చేస్తున్నారు. కేవలం 4 గంటల వ్యవధిలోనే ఈ హ్యాష్‌ట్యాగ్‌పై ఒకటిన్నర లక్షకు పైగా ట్వీట్లు పోస్టయ్యాయి.

Updated Date - 2020-10-25T00:48:32+05:30 IST